వాచ్‌ఓఎస్‌ 9లో మరిన్ని ఆరోగ్య ఫీచర్లు

ABN , First Publish Date - 2022-06-11T06:00:21+05:30 IST

యాపిల్‌ తన వాచ్‌ఓఎస్‌ 9లో ఆరోగ్య ఫీచర్లని మరింత విస్తృతపరుస్తోంది.

వాచ్‌ఓఎస్‌ 9లో మరిన్ని ఆరోగ్య ఫీచర్లు

యాపిల్‌ తన వాచ్‌ఓఎస్‌ 9లో ఆరోగ్య ఫీచర్లని మరింత విస్తృతపరుస్తోంది. వర్కౌట్‌ యాప్‌, స్లీప్‌ స్టేజెస్‌, మొదటిసారి మెడికేషన్స్‌ యాప్‌, అఫిబ్‌ హిస్టరీ(రక్తం గడ్డ కట్టేందుకు దారితీసే విధంగా గుండెస్పందన) తదితరాలతో మెరుగుపరుస్తోంది. మొత్తానికి యాపిల్‌ వాచీ తమ వినియోగదారుల కోసం ఆరోగ్యపరంగా మరింత లోతైన సమాచారాన్ని అదీ వ్యక్తిగతానికి పరిమితం చేస్తూ సమాచారం అందించే యత్నంలో ఉంది.  బెస్ట్‌ పెర్ఫార్మింగ్‌ క్రీడాకారుల వర్కౌట్స్‌ అనుభవాలను పొందుపరుస్తుంది. వినియోగదారులకు ఆరోగ్య సంబంధ సమాచారాన్ని మరింతగా అందజేసే పనిలో భాగమిది. ఉదాహరణకు ఎఫిబ్‌ హిస్టరీ వినియోగదారుడి పరిస్థితిని మరింత లోతుగా తెలియజేస్తుంది. ముఖ్యంగా వీక్లీ నోటిఫికేషన్లు  కేస్‌ హిస్టరీని వివరంగా తెలియజేస్తాయి. డాక్టర్లతో షేర్‌ చేసుకునేందుకు వీలుగా ఇవి ఉంటాయి. రాబోయే జూలైలో పబ్లిక్‌ బేటా అందుబాటులోకి వస్తుందని కూడా కంపెనీ తెలిపింది.  

Updated Date - 2022-06-11T06:00:21+05:30 IST