9 జిల్లాల్లో పదిలోపు Covid కేసులు

ABN , First Publish Date - 2022-02-18T17:15:40+05:30 IST

రాష్ట్రంలో కొవిడ్‌ప్రభావం క్రమేపీ తగ్గుముఖం పట్టింది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 1,579మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా 9 జిల్లాల్లో పదిలోపు కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా బెంగళూరులో 769 మంది, మిగిలిన జిల్లాల్లో

9 జిల్లాల్లో పదిలోపు Covid కేసులు

బెంగళూరు: రాష్ట్రంలో కొవిడ్‌ప్రభావం క్రమేపీ తగ్గుముఖం పట్టింది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 1,579మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా 9 జిల్లాల్లో పదిలోపు కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా బెంగళూరులో 769 మంది, మిగిలిన జిల్లాల్లో వందలోపు కేసులు నమోదయ్యాయి. 5,079 మంది కోలుకోగా 23మంది మృతి చెందారు. వీరిలో బెంగళూరులో ఏడుగురు, ఐదు జిల్లాల్లో ఇద్దరు చొప్పున, ఆరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. ప్రస్తుతం 30 జిల్లాల్లో 19,761 మంది చికిత్స పొందుతుండగా బెంగళూరులో 8,828మంది ఉన్నారు.

Updated Date - 2022-02-18T17:15:40+05:30 IST