9 రైళ్లకు అన్‌ రిజర్వుడు అదనపు బోగీలు

Published: Thu, 20 Jan 2022 11:25:32 ISTfb-iconwhatsapp-icontwitter-icon
9 రైళ్లకు అన్‌ రిజర్వుడు అదనపు బోగీలు

ఐసిఎఫ్‌(చెన్నై): చెన్నై సెంట్రల్‌తో పాటు వివిధ నగరాల నుంచి నడిపే తొమ్మిది రైళ్లను అదనంగా అన్‌ రిజర్వుడు సెకండ్‌ క్లాస్‌ బోగీలతో నడుపనున్నట్లు దక్షిణ రైల్వే అధికారులు ప్రకటించారు. ఆ మేరకు ఎంజీఆర్‌ సెంట్రల్‌-కేఎస్‌ ఆర్‌ బెంగుళూరు (లాల్‌బాగ్‌ ఎక్స్‌ప్రెస్‌), ఎంజీఆర్‌ సెంట్రల్‌- మైసూర్‌ సూపర్‌ఫాస్ట్‌, ఎర్నాకుళం జంక్షన్‌ -కేఎస్‌ఆర్‌ బెంగుళూరు (లాల్‌బాగ్‌ సూపర్‌ఫాస్ట్‌) రైళ్లలో గురువారం నుంచి 4 జనరల్‌ సెకండ్‌ క్లాస్‌ బోగీలు, దివ్యాంగులు, లగేజీ కోసం మరో బోగీతో నడుపనున్నారు. ఇదే విధంగా తూత్తుకుడి-మైసూర్‌ ఎక్స్‌ప్రెస్‌ను 21 నుంచి దివ్యాంగులు, లగేజీ కోసం అదనంగా రెండు సెకండ్‌ క్లాస్‌ బోగీలతో నడుపనున్నారు. సెంట్రల్‌- బిట్ర గుంట ఎక్స్‌ప్రెస్‌ రైలును అదనంగా 4 ఎలక్ర్టికల్‌ (ఎంఈఎంయూ) కోచ్‌లతో బుధవారం నుంచి నడుపుతున్నట్లు పేర్కొన్నారు. సెంట్రల్‌- విజయవాడ (పినాకిని సూపర్‌ఫాస్ట్‌) రైలును అదనంగా ఆరు సెకండ్‌ క్లాస్‌ బోగీలతోను, దివ్యాంగులు, లగేజీల కోసం రెండు సెకండ్‌ క్లాస్‌ బోగీలతోను గురువారం నుంచి నడుపనున్నారు. మన్నార్‌గుడి-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ను అదనంగా రెండు సెకండ్‌ క్లాస్‌ బోగీలు, ఆరు జనరల్‌ సెకండ్‌ క్లాస్‌ బోగీలతోను, దివ్యాంగులు, లగేజీ కోసం రెండు సెకండ్‌ క్లాస్‌ బోగీలతో ఈ నెల 24 నుంచి నడుపనున్నారు. అదే విధంగా కోయంబత్తూర్‌-తిరుపతి సూపర్‌ఫాస్ట్‌ రైలుకు అదనంగా ఆరు జనరల్‌ సెకండ్‌ క్లాస్‌ బోగీలతో, దివ్యాంగులు, లగేజీ కోసం రెండు సెకండ్‌ క్లాస్‌ బోగీలతో ఫిబ్రవరి రెండు నుంచి నడుపనున్నారు. ఇక సెంట్రల్‌-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ రైలును అదనంగా మూడు జనరల్‌, సెకండ్‌ క్లాస్‌ బోగీలతోను, దివ్యాంగులు, లగేజీల కోసం రెండు సెకండ్‌ క్లాస్‌ బోగీలతో ఫిబ్రవరి 20వ తేది నుంచి నడుపున్నారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.