Good News : ఇక వాట్సాప్‌లో డిజీలాకర్‌..

ABN , First Publish Date - 2022-05-24T08:56:37+05:30 IST

డిజీలాకర్‌ వినియోగదారులకు శుభవార్త..! పాన్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, వాహన రిజిస్ట్రేషన్‌ పత్రాలు, సీబీఎ్‌సఈ 10, 12 తరగతుల సర్టిఫికెట్లు తదితర డాక్యుమెంట్లను కేంద్రం అందిస్తున్న క్లౌడ్‌ స్టోరేజీలో భద్రపరుచుకునే వెసులుబాటు కల్పించే డిజీలాకర్‌ యాప్‌ ఇకపై వాట్సాప్‌ తో అనుసంధానం కానుంది.

Good News : ఇక వాట్సాప్‌లో డిజీలాకర్‌..

  • 9013151515 వాట్సాప్‌
  • డాక్యుమెంట్ల డౌన్‌లోడ్‌ సౌకర్యం
  • కొత్త ఖాతాను ప్రారంభించవచ్చు
  • వెల్లడించిన మైగోవ్‌ సీఈవో


న్యూఢిల్లీ, మే 23: డిజీలాకర్‌ వినియోగదారులకు శుభవార్త..! పాన్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, వాహన రిజిస్ట్రేషన్‌ పత్రాలు, సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల సర్టిఫికెట్లు తదితర డాక్యుమెంట్లను కేంద్రం అందిస్తున్న క్లౌడ్‌ స్టోరేజీలో భద్రపరుచుకునే వెసులుబాటు కల్పించే డిజీలాకర్‌ యాప్‌ ఇకపై వాట్సాప్‌ తో అనుసంధానం కానుంది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ డిజిటల్‌ ఇండియా ప్రాజెక్టులో భాగమైన ‘మైగోవ్‌’ సంస్థ సీఈవో అభిషేక్‌ సింగ్‌ సోమవారం వెల్లడించారు. ఇందుకోసం 9013151515 వాట్సాప్‌ నంబర్‌ కేటాయించారు. ఆ నంబర్‌కు ‘నమస్తే’ లేదా ‘హై’ లేదా ‘డిజీలాకర్‌’ అని ఆంగ్లంలో సందేశం పంపితే.. చాట్‌బోట్‌ ప్రతిస్పందిస్తూ.. మెనూ జాబితాను రిప్లైగా ఇ స్తుంది. అందులోంచి డిజీలాకర్‌ అథెంటికేషన్‌ను ఎంచుకుంటే.. అప్పటికే భ ద్రపరిచిన డాక్యుమెంట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అంతేకాదు.. ఈ నంబర్‌ కు వాట్సాప్‌ చేయడం ద్వారా కొత్తగా డిజీలాకర్‌ ఖాతాను ప్రారంభించవచ్చు. కొత్త డాక్యుమెంట్లను అప్‌లోడ్‌ చేయవచ్చు. 

Updated Date - 2022-05-24T08:56:37+05:30 IST