రెండోసారి కొవిడ్‌ను జయించిన 90ఏళ్ల వృద్ధుడు

ABN , First Publish Date - 2021-04-23T22:03:44+05:30 IST

దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. కరోనా బారినపడి రోజుకు వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఔరంగబాద్‌లో జరిగిన ఓ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పాండురంగ ఆత్మారామ్ అగ్లేవ్ అనే 90ఏళ్ల వృద్ధుడికి గత సంవత్సరం నవంబర్‌లో కరోనా సోకింది

రెండోసారి కొవిడ్‌ను జయించిన 90ఏళ్ల వృద్ధుడు

ఔరంగాబాద్: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. కరోనా బారినపడి రోజుకు వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఔరంగబాద్‌లో జరిగిన ఓ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పాండురంగ ఆత్మారామ్ అగ్లేవ్ అనే 90ఏళ్ల వృద్ధుడికి గత సంవత్సరం నవంబర్‌లో కరోనా సోకింది. దీంతో ఆస్పత్రిలో చేరిన ఆయన పది రోజుల తర్వాత కరోనాను జయించి ఇంటికి వెళ్లాడు. అయితే ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ వ్యాపిస్తున్న వేళ పాండురంగకు ఈనెలలో మళ్లీ కరోనా సోకింది. దీంతో కుటంబసభ్యులు అతడిని స్వామి రామానంద్ తీర్థ్ మెడికల్ కాలేజీలో చేర్పించారు. ఆయన రెండోసారి కరోనా నుంచి కోలుకొని ఈ నెల 17న డిశ్చార్జ్ అయ్యాడు.


కరోనా నుంచి కోలుకున్న పాడురంగ తన ఆరోగ్యరహస్యాన్ని తెలిపాడు. వ్యాయామం చేయకపోవడం వల్లే నేటి యువత ఫిట్‌గా ఉండట్లేదని అన్నాడు. తను ప్రతిరోజూ వాకింగ్ చేస్తానని, ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా సంతోషంగా ఉంటానని తెలిపాడు. అందువల్లే తను త్వరగా కోలుకున్నానని వెల్లడించాడు.


ఇలాంటి కొంత మంది వల్ల వైద్యసిబ్బందిలో నైతికస్థైర్యం పెరుగుతుందని ఆసుపత్రి కొవిడ్ 19 ఇంచార్జ్ సిద్ధేశ్వర్ బిరాజ్‌దార్ తెలిపారు. పాండురంగ కోసం తాను ప్రతిసారి అదనంగా పదినిమిషాలు కేటాయించేవాడినని సిద్ధేశ్వర్ తెలిపారు.

Updated Date - 2021-04-23T22:03:44+05:30 IST