రూ.92 కోట్లతో 90 పార్కుల అభివృద్ధి

ABN , First Publish Date - 2021-11-25T06:36:45+05:30 IST

రూ.92 కోట్లతో 90 పార్కుల అభివృద్ధి

రూ.92 కోట్లతో 90 పార్కుల అభివృద్ధి
ప్రసంగిస్తున్న శిల్పా చక్రపాణిరెడ్డి. పక్కన చైర్మన్‌ రామారావు తదితరులు

ఏపీ గ్రీనింగ్‌, బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ రామారావు

15 మంది డైరెక్టర్లతో ప్రమాణస్వీకారం

వన్‌టౌన్‌, నవంబరు 24 : రాష్ట్రంలోని 32 పట్టణ ప్రాంతాల్లో రూ.92 కోట్లతో 90 పార్కులను అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర గ్రీనింగ్‌, బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఎన్‌.రామారావు తెలిపారు. కార్పొరేషన్‌కు నియమితులైన 15 మంది డైరెక్టర్ల ప్రమాణస్వీకార కార్యక్రమం బెరంపార్కులో బుధవారం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన రామారావు డైరెక్టర్లతో ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ సంస్థలు, మున్సిపాలిటీలు, ఆసుపత్రులు, యూనివర్సిటీల్లో కన్సల్టెన్సీ విధానంలో గ్రీనరీని పెంచేందుకు తమ సంస్థ విస్తృతంగా పనిచేస్తోందన్నారు. శ్రీశైలం ఎమ్మెల్యే, కార్పొరేషన్‌ డైరెక్టర్‌ శిల్పా చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ పట్టణాలు, నగర పంచాయతీల సుందరీకరణకు ప్రభుత్వ రూ.45కోట్లను కేటాయించిందని చెప్పారు. కె.కోట ఎమ్మెల్యే కె.శ్రీనివాస్‌, కార్పొరేషన్‌ ఎండీ డీవీ సంపత్‌కుమార్‌, జనరల్‌ మేనేజర్‌ బలరామిరెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు. సి.సుజాత, జె.సరళ, షేక్‌ ఫర్జానా, ఆర్‌.గుణశేఖరరెడ్డి, షేక్‌ జానీ, చింతా కిరణ్‌కుమార్‌, కె.భరత్‌, పి.రాణి, బి.నాగభూపాల్‌రెడ్డి, కె.సౌజన్య, కె.అంజిరెడ్డి, ఆల్యా నూరాని, సీహెచ్‌ సత్యవతి, కె.ఉమామహేశ్వరి డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరంలో కార్పొరేషన్‌ కార్యాలయంలో మొక్కలు నాటారు.

Updated Date - 2021-11-25T06:36:45+05:30 IST