‘వ్యాక్సిన్ వేయించేకోండి. భయం లేదు’.. 97ఏళ్ల బామ్మ వీడియో వైరల్

May 8 2021 @ 19:57PM

న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం మూడో సారి వ్యాక్సినేషన్ డ్రైవ్ నడుస్తోంది. అయినా కొంతమందిలో ఇప్పటికీ వ్యాక్సిన్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలోనే ఓ బామ్మ చేసిన వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. కరోనా వ్యాక్సిన్‌పై భయాలు వద్దని, అందరూ కచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవాలని ఆమె ఈ వీడియోలో కోరింది. ఈ వీడియోను సీనియర్ జర్నలిస్ట్ లతా వెంకటేశన్ షేర్ చేశారు. ఈ వీడియోలో ఓ బామ్మ తాను వ్యాక్సిన్ తీసుకున్న సంగతులను వివరించింది. తాను మార్చిలో వ్యాక్సిన్ తీసుకున్నానని, అప్పటి నుంచి తాను ఆరోగ్యంగానే ఉన్నానని చెప్పుకొచ్చింది. తనకు కనీసం నొప్పి కూడా అనిపించలేదని, ఇప్పటివరకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్‌లకు కూడా గురి కాలేదని వెల్లడించింది.

‘వ్యాక్సిన్ తీసుకోవడానికి భయపడకండి. వెంటనే వ్యాక్సిన్ తీసుకోండి. అదే మీకు, మీ చుట్టూ ఉన్న వారందరికీ మేలు. నేను వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా అంతకుముందులానే ఉన్నాను. నా ఆరోగ్యంలో ఎలాంటి మార్పులూ రాలేదు’ అంటూ బామ్మ చెప్పుకొచ్చింది. అలాగే ఆన్‌లైన్‌లో వ్యాక్సినేషన్‌పై చక్కర్లు కొడుతున్న పుకార్లను ఎవరూ నమ్మవద్దని సూచించింది. అంతేకాకుండా తాను రెండో డోస్ తీసుకునేందుకు ఎదురు చూస్తున్నట్లు చెప్పుకొచ్చింది.


Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...