ఉమ్మడి జిల్లాలో 970కేసులు

ABN , First Publish Date - 2020-09-23T06:25:12+05:30 IST

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మంగళవారం 970 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో రంగారెడ్డి జిల్లాలో 488, మేడ్చల్‌

ఉమ్మడి జిల్లాలో 970కేసులు

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మంగళవారం 970 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో రంగారెడ్డి జిల్లాలో 488, మేడ్చల్‌ జిల్లాలో 498, వికారాబాద్‌ జిల్లాలో 24 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మూడుజిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 74,179కి చేరుకుంది. 


చేవెళ్ల ఇబ్రహీంపట్నం / కందుకూరు / శంషాబాద్‌ ఆమనగల్లు / షాద్‌నగర్‌/ కులకచర్ల : చేవెళ్లడివిజన్‌లో 306 మందికి కరోనా పరీక్షలు చేయగా 35మందికి పాజిటివ్‌గా తేలింది. అదేవిధంగా చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో 46మందికి పరీక్షలు చేయగా 4, ఆలూర్‌ ప్రాథమిక ఆసుప్రతిలో 56 మందికిగాను 1, శంకర్‌పల్లి మండలంలో 58మందికిగాను 3, మొయినాబాద్‌ మండలంలో 66 మందికిగాను 27, షాబాద్‌ మండలంలో 80 మందికిగాను నలుగురికి పాజిటివ్‌ వచ్చింది. 


ఇబ్రహీంపట్నం డివిజన్‌లో 474 మందికి కరోనా టెస్టులు చేయగా 50మందికి పాజిటివ్‌ వచ్చింది. ఇబ్రహీంపట్నం సీహెచ్‌సీలో 74 మందికి పరీక్షలు నిర్వహించగా 3, అబ్దుల్లాపూర్‌మెట్‌లో 61 మందికిగాను 15, యాచారంలో 50 మందికిగాను 5, దండుమైలారంలో 34 మందికిగాను 2, ఎలిమినేడులో 44 మందికిగాను 3, మంచాలలో 50 మందికిగాను 3, ఆరుట్లలో 15 మందికిగాను 1, మాడ్గులలో 43 మందికిగాను 3, సీహెచ్‌సీ హయత్‌నగర్‌లో 50 మందికిగాను 7, తట్టిఅన్నారంలో 25 మందికిగాను 7, రాగన్నగూడలో 28 మందికిగాను ఇద్దరికి పాజిటివ్‌ అని తేలింది.


కందుకూరు ప్రభుత్వం ఆరోగ్యకేంద్రంలో 48మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఎనిమిది మందికి పాజిటివ్‌ వచ్చింది. ఇందులో కందుకూరుకు చెందిన ముగ్గురు, నేదునూరు, దెబ్బడగూడకు చెందిన ఒక్కొక్కరు, దాసర్లపల్లికి  చెందిన ఇద్దరు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. శంషాబాద్‌ మున్సిపల్‌ కేంద్రంలో 73 మందికి కరోనా పరీక్షలు చేయగా 9 మందికి పాజిటివ్‌ వచ్చింది. ఆమనగల్లు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 51 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా నలుగురికి పాజిటివ్‌ వచ్చింది. 


షాద్‌నగర్‌ డివిజన్‌లో 309 మందికి కరోనా పరీక్షలు చేయగా 31 మందికి పాజిటివ్‌ వచ్చింది. షాద్‌నగర్‌లో 5, ఫరూఖ్‌నగర్‌ మండలంలో 15, నందిగామ మండలంలో 8మంది ఉన్నారు. మిగతా ముగ్గురు ఇతర మండలాలకు చెందినవారున్నారు.


కులకచర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో 43 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో చెల్లాపూర్‌లో 6, చౌడాపూర్‌లో 1, ఇప్పాయిపల్లిలో 1 కరోనా పాజిటివ్‌ కేసులు వచ్చినట్లు వైద్యాధికారి మురళీకృష్ణ తెలిపారు.

Updated Date - 2020-09-23T06:25:12+05:30 IST