Advertisement

ఎన్నాళ్లకెన్నాళ్లకు..వందకన్నా తగ్గిన కరోనా కేసుల సంఖ్య

Oct 25 2020 @ 01:18AM

98 పాజిటివ్‌లు నమోదు

188 మంది డిశ్చార్జి


నెల్లూరు (వైద్యం) అక్టోబరు 24 : కొన్ని నెలలుగా జిల్లాలో విజృంభిస్తున్న కరోనా వైరస్‌ మెల్లమెల్లగా తగ్గుముఖం పడుతోంది. గతంలో రోజుకు వెయ్యికిపైగా నమోదైన కేసులు కొద్ది రోజులుగా వందల్లో నమోదవుతున్నాయి. ఇటీవల వంద, రెండొందల కేసులు వస్తుండగా  శనివారం 98 కేసులు నమోదయ్యాయి. ఒకరోజు పాజిటివ్‌ల సంఖ్య వందకన్నా తక్కువ రావడం చాలా కాలం తర్వాత ఇదే మొదటిసారి. ఎలాంటి మరణాలు సంభవించలేదు. అలాగే పలు ఆసుపత్రుల్లో కోలుకున్న 188 మందిని అధికారులు డిశ్చార్జ్‌ చేశారు.

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.