సైన్యంలో చేరతానంటున్న 98 ఏళ్ల బామ్మ

ABN , First Publish Date - 2022-03-19T22:31:08+05:30 IST

రష్యా సైన్యంపై పోరాడేందుకు ఉక్రెయిన్‌లో సాధారణ పౌరుల నుంచి సెలబ్రిటీల వరకు ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో పెద్ద వయసు వాళ్లు కూడా ఉంటున్నారు.

సైన్యంలో చేరతానంటున్న 98 ఏళ్ల బామ్మ

రష్యా సైన్యంపై పోరాడేందుకు ఉక్రెయిన్‌లో సాధారణ పౌరుల నుంచి సెలబ్రిటీల వరకు ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో పెద్ద వయసు వాళ్లు కూడా ఉంటున్నారు. తాజాగా 98 ఏళ్ల బామ్మ ఒకరు ఉక్రెయిన్ సైన్యంలో చేరడానికి ముందుకొచ్చింది. ఉక్రెయిన్ రక్షణశాఖ సోషల్ మీడియాలో వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉక్రెయిన్‌కు చెందిన ఓల్హా తెర్దో్క్లిబోవా అనే 98 ఏళ్ల వృద్ధురాలు సైన్యంలో చేరి, రష్యాపై పోరాడతానని చెప్పింది. ఆమె రెండో ప్రపంచ యుద్ధం సమయంలో సైన్యంలో పనిచేసింది. ఆ అనుభవంతో ఇప్పుడు సైన్యంలో చేరతానని కోరింది. అయితే, వయసురీత్యా ఆమెను సైన్యంలో చేర్చుకునేందుకు ఉక్రెయిన్ ఆర్మీ నిరాకరించింది. 

Updated Date - 2022-03-19T22:31:08+05:30 IST