15 ఏళ్ల బాలుడికి అరుదైన చికిత్స

ABN , First Publish Date - 2021-09-18T19:29:44+05:30 IST

అరుదైన జన్యు వ్యాధితో బాధపడుతున్న 15 ఏళ్ల బాలుడికి మణిపాల్ ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా చికిత్స చేశారు.

15 ఏళ్ల బాలుడికి అరుదైన చికిత్స

విజయవాడ: అరుదైన జన్యు వ్యాధితో బాధపడుతున్న 15 ఏళ్ల బాలుడికి మణిపాల్ ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా చికిత్స చేశారు. కె. హర్షవర్ధన్ అనే బాలుడు ఆస్టియోపెట్రోసిస్‌తో బాధపడుతున్నాడు. నేత్ర దృష్టి లోపంతో పాటు శారీరకంగా ఎదుగుదల లేని ఆ బాలుడికి మణిపాల్ ఆసుపత్రి ఈఎన్‌టీ స్పెషలిస్ట్ డాక్టర్ వీవీకే సందీప్ చికిత్సనందించారు. హర్షవర్ధన్ ఎడమ కంటి నొప్పితో పాటు రెండు నెలలుగా తల నొప్పితో బాధపడుతున్నాడని, దీనికి తోడు అతడికి హెడ్రోసెఫాలస్ కూడా ఉందని డాక్టర్ సందీప్ తెలిపారు. దీంతో అతడికి ఎండోస్కోపీతో ఆప్టిక్‌ నెర్వ్‌ డీ కంప్రెషన్‌, నేవిగేషన్‌ గైడెన్స్‌ ద్వారా చికిత్స చేసినట్లు వివరించారు. మణిపాల్‌ హాస్పిటల్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సుధాకర్‌ కంటిపూడి మాట్లాడుతూ.. ‘‘ఇది  అత్యంత అరుదైన వ్యాధి. దాదాపు 5లక్షల మందిలో ఒకరికి మాత్రమే వస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ వ్యాధికి చికిత్స చేయడం ఇదే తొలిసారి.’’ అన్నారు.

Updated Date - 2021-09-18T19:29:44+05:30 IST