Kempegowda Statue: ఈ విగ్రహం ముందు బాహుబలిలో భల్లాలదేవుడి విగ్రహం ఏం సరిపోతుంది.. కత్తి బరువే 4వేల కేజీలు..

ABN , First Publish Date - 2022-05-04T01:20:40+05:30 IST

కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో నాడప్రభు కెంపేగౌడ భారీ విగ్రహ ఆవిష్కరణకు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. బెంగళూరు విమానాశ్రయ ప్రాంగణంలో 108 అడుగుల కెంపేగౌడ విగ్రహాన్ని..

Kempegowda Statue: ఈ విగ్రహం ముందు బాహుబలిలో భల్లాలదేవుడి విగ్రహం ఏం సరిపోతుంది.. కత్తి బరువే 4వేల కేజీలు..

బెంగళూరు: Karnataka రాజధాని Bengaluru నగరంలో Kempegowda భారీ విగ్రహ ఆవిష్కరణకు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. Bengaluru Airport ప్రాంగణంలో 108 అడుగుల కెంపేగౌడ విగ్రహాన్ని త్వరలో ఆవిష్కరించనున్నారు. 16వ శతాబ్దంలో కర్ణాటకలోని చాలా ప్రాంతాలను పరిపాలించిన ఒక రాజు కెంపేగౌడ. విజయనగర సామ్రాజ్య రాజుల కింద Kempegowda ఒక అధిపతిగా ఉండేవారు. చారిత్రక బెంగళూరు నగరానికి నిర్మాతగా కెంపేగౌడను చెబుతారు. Bengaluru నగర నిర్మాణానికి విజయనగర రాజులతో మాట్లాడి నగర నిర్మాణానికి 1532లో పునాది పడేలా చేసిన ఘన చరిత్ర కెంపేగౌడది. చారిత్రక బెంగళూరు నగరాన్ని నిర్మించి, సుందరీకరించడంలో కీలక పాత్ర పోషించిన కెంపేగౌడ సేవలకు గుర్తుగా విమానాశ్రయానికి ఆయన పేరే పెట్టారు. ఇప్పుడు తాజాగా ఆయన భారీ విగ్రహం ఆవిష్కరణకు సిద్ధంగా ఉంది.


కెంపేగౌడ విగ్రహం చేతిలో ఉంచే ఖడ్గం సోమవారం ఢిల్లీ నుంచి ప్రత్యేక వాహనంలో బెంగళూరుకు చేరుకుంది. ఈ ఖడ్గం బరువు 4000 కిలోలు. 35 అడుగుల పొడవున్న ఈ ఖడ్గానికి కర్ణాటక ఉన్నత విద్యా శాఖ మంత్రి డాక్టర్ సీఎన్ అశ్వథ్ నారాయణ్ పూజ చేశారు. విగ్రహ నిర్మాణ పనులను పరిశీలించారు.


విమానాశ్రయ సమీపంలో 23 ఎకరాల విస్తీర్ణంలో విగ్రహ ఏర్పాటుతో పాటు, హెరిటేజ్ పార్క్‌ను తీర్చిదిద్ది కెంపేగౌడకు అంకితమివ్వనున్నారు. కెంపేగౌడ విగ్రహ నిర్మాణం కోసం Karnataka Government రూ.85 కోట్లు ఖర్చు చేస్తోంది. Devanahalli సమీపంలోని Kempagowda International Airport సమీపంలోని 23 ఎకరాల స్థలంలో విగ్రహ నిర్మాణం, హెరిటేజ్ పార్క్ రూపుదిద్దుకుంటోంది. ఈ విగ్రహం ఈ సంవత్సరమే ఆవిష్కరణకు సిద్ధం కాబోతోంది.

Updated Date - 2022-05-04T01:20:40+05:30 IST