బ్యాంక్ జాబ్, లక్ష రూపాయల జీతం వదులుకున్న వ్యక్తి.. అతడికి ఏమైనా పిచ్చా అనుకున్నారు.. కానీ ఇపుడు

ABN , First Publish Date - 2021-12-27T01:27:20+05:30 IST

చిన్నతనం నుంచి కష్టపడి చదివాడు. అతడు పడిన కష్టానికి ఫలితం దక్కింది. చదువు పూర్తయ్యాక.. ఓ ప్రైవేట్ బ్యాంక్‌లో జాబొచ్చింది. నెలకు లక్ష రూపాయల జీతంతో జాబ్ ఆఫర్ రావడంతో.. అతడి కుటుంబ సభ్యుల

బ్యాంక్ జాబ్, లక్ష రూపాయల జీతం వదులుకున్న వ్యక్తి.. అతడికి ఏమైనా పిచ్చా అనుకున్నారు.. కానీ ఇపుడు

ఇంటర్నెట్ డెస్క్: చిన్నతనం నుంచి కష్టపడి చదివాడు. అతడు పడిన కష్టానికి ఫలితం దక్కింది. చదువు పూర్తయ్యాక.. ఓ ప్రైవేట్ బ్యాంక్‌లో జాబొచ్చింది. నెలకు లక్ష రూపాయల జీతంతో జాబ్ ఆఫర్ రావడంతో.. అతడి కుటుంబ సభ్యుల ఆనందానికి ఆవధుల్లేకుండా పోయాయి. జాబ్‌లో చేరిన కొన్ని నెలల తర్వాత అతడు కీలక నిర్ణయం తీసుకున్నాడు. బ్యాంక్ జాబ్‌ను వదులేయాలని నిశ్చయించుకున్నాడు. అతడి ఆలోచిన విని.. కుటుంబ సభ్యులు కంగారుపడ్డారు. విషయం తెలిసి.. నలుగురూ నవ్వుకున్నారు. అతడికి ఏమైనా పిచ్చా.. జాబ్ మానేస్తా అంటున్నాడు అని మాట్లాడుకున్నారు. అయితే అతడు మాత్రం.. తన నిర్ణయానికే కట్టుబడి ఉన్నాడు. జాబ్ వదిలేశాడు. ప్రస్తుతం కళ్లు చెదిరేలా ఆర్జిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



హర్యానాలోని సోనిపట్ ప్రాంతానికి చెందిన కపిల్.. మంచి ఉద్యోగం సాధించాలని చిన్నప్పటి నుంచి కష్టపడి చదివేవాడు. చివరికి అతడు కన్న కలలు నిజమయ్యాయి. నెలకు లక్ష రూపాయల జీతంతో ప్రైవేట్ కంపెనీలో జాబ్ వొచ్చింది. కొన్ని నెలలపాటు జాబ్ చేశాడు. ఈ క్రమంలోనే కరోనా మహమ్మారి.. ప్రపంచ వ్యాప్తంగా విజృంభించడం మొదలైంది. దాని ప్రభావంతో.. సదరు బ్యాంక్ యాజమాన్యం అతడిని గుజరాత్‌కు బదిలీ చేసింది. అయితే.. గుజరాత్‌‌కు వెళ్లి జాబ్ చేయడం అతడికి ఇష్టం లేదు. దీంతో రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాడు. విషయం ఇంట్లో చెప్పాడు. అయితే అతడి మాటలు విని కుటుంబ సభ్యులు కంగారుపడ్డారు. నలుగురూ నాలుగు రకాలుగా అనుకున్నారు.


 కానీ.. కపిల్ వాటిని లెక్క చేయలేదు. జాబ్‌కు టాటా చెప్పేశాడు. అనంతరం వ్యవసాయంపై దృష్టిపెట్టాడు. కరోనా సమయంలో ఆర్గినిక్ ఉత్పత్తులకు ఒక్కసారిగా డిమాండ్ పెరగడాన్ని గమనించిన కపిల్.. ఆర్గానిక్ పద్ధతిలో జామ కాయలను పండించడం మొదలు పెట్టాడు. సహజ ఎరువులను ఉపయోగించి.. సుమారు ఎనిమిది రకాల జామ కాయలను పండిస్తున్నాడన్న విషయం స్థానికంగా ఉన్న వ్యాపారులకు తెలిసింది. దీంతో కపిల్ తోటలో పండిన జామ కాయలను కొనేందుకు వ్యాపారులు క్యూకట్టారు. ఈ నేపథ్యంలోనే కపిల్ నెలకు రూ.4 లక్షల వరకూ సంపాదిస్తూ అందిరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. 




Updated Date - 2021-12-27T01:27:20+05:30 IST