విధిరాత అంటే ఇదేనేమో.. సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్న ఈ యువకుడు ఎవరో, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలిస్తే..

ABN , First Publish Date - 2022-08-18T23:58:47+05:30 IST

పూలు అమ్మిన చోటే కట్టెలు అమ్మిన చందంగా.. విధిరాత అనేది.. ఒక్కొక్కరి విషయంలో ఒక్కోలా ఉంటుంది. కొందరు సమాన్య స్థాయి నుంచి అమాంతం అసామాన్య స్థాయికి వెళ్తుంటారు...

విధిరాత అంటే ఇదేనేమో.. సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్న ఈ యువకుడు ఎవరో, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలిస్తే..

పూలు అమ్మిన చోటే కట్టెలు అమ్మిన చందంగా.. విధిరాత అనేది.. ఒక్కొక్కరి విషయంలో ఒక్కోలా ఉంటుంది. కొందరు సమాన్య స్థాయి నుంచి అమాంతం అసామాన్య స్థాయికి వెళ్తుంటారు. మరికొందరు ఉన్నత స్థానాల నుంచి ఒక్కసారిగా అగాధంలోకి పడిపోతుంటారు. మరికొందరు ఆర్థిక సమస్యల కారణంగా తమ లక్ష్యాలను పక్కనపెట్టి.. జీవిత పోరాటంలో రాజీపడుతుంటారు. ఇలాంటి వ్యక్తుల గురించి గతంలో చాలా సార్లు విన్నాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే యువకుడు కూడా ఈ కోవకే చెందుతాడు. విధిరాత అనుకూలించక.. ప్రస్తుతం సెక్యూరిటీ గార్డుగా (security guard) పని చేస్తున్న యువకుడు గురించి తెలసుకుని అంతా.. అయ్యో పాపం! అంటూ సానుభూతి చూపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..


మధ్యప్రదేశ్‌కు (Madhya Pradesh) చెందిన వైభవ్ అనే యువకుడు.. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) నోయిడాలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. ఇతడి గురించి తెలుసుకున్న స్థానికులు.. అయ్యో పాపం అంటూ సానుభూతి తెలియజేస్తున్నారు. వైభవ్.. ఆరేళ్లుగా బేస్ బాల్ (baseball) ఆడుతున్నాడు. ఈ ఆటలో ఉత్తమ ప్రతిభ చూపడంతో అనతి కాలంలోనే ఉన్నత స్థానానికి చేరుకున్నాడు. అంతేకాదు, మధ్యప్రదేశ్ బేస్ బాస్ జట్టుకు 20సార్లు ప్రాతినిధ్యం వహించాడు. అయితే అతడి కుటుంబ ఆర్థిక పరిస్థితి (Financial situation) అంతంతమాత్రమే కావడంతో కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభించలేదు. దీంతో ఒక్కసారిగా అతడి ఆటకు బ్రేక్ పడింది. ఉన్నట్టుండి బేస్ బాల్ క్రీడకు దూరమైన అతను.. 3నెలల క్రితం నోయిడాకు వచ్చాడు.

Dubai jobs scam: దుబాయ్‌లో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి.. పాకిస్థాన్‌కు పంపించిన ఏజెంట్.. 20ఏళ్ల తర్వాత వృద్ధురాలి పరిస్థితి ఏంటంటే..


కుటుంబ సభ్యులకు చేదోడువాదోడుగా ఉండేందుకు ఓ సొసైటీకి చెందిన గేటు వద్ద సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. ప్రస్తుతం సంపాదన తన ధ్యేయమని, కుటుంబ సభ్యులకు భారం కాలేక.. సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నానని వైభవ్ తెలిపాడు. తాను 12వ తరగతి వరకే చదవడంతో మంచి ఉద్యోగం రాలేదన్నాడు. విధులు పూర్తయిన వెంటనే బేస్ బాల్ క్రీడకు సంబంధించిన సాధన చేస్తున్నానని చెప్పాడు. ఎప్పటికైనా బేస్ బాల్ క్రీడను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లి.. దేశానికి ప్రాతినిధ్యం వహించాలన్నది తన ఆశయమని చెబుతున్నాడు. ఇతడి గురించి తెలుసుకున్న నోయిడా ప్రజలు.. మద్దతుగా నిలుస్తున్నారు. అతడి కోరిక నెరవేరాలని మనమూ కోరుకుందాం.

Viral Video: రియల్ హీరో అంటే ఇతనే.. కుటుంబ పోషణ కోసం ఇతడు పడుతున్న కష్టానికి.. సెల్యూట్ కొట్టాల్సిందే..



Updated Date - 2022-08-18T23:58:47+05:30 IST