పనస పండు కోసం చెట్టెక్కిన ఎలుగు

ABN , First Publish Date - 2020-07-01T23:07:06+05:30 IST

శ్రీకాకుళం జిల్లాలో స్థానికంగా ఎలుగుబంట్లు హల్ చల్ చేస్తున్నాయి.

పనస పండు కోసం చెట్టెక్కిన ఎలుగు

శ్రీకాకుళం: జిల్లాలో స్థానికంగా ఎలుగుబంట్లు హల్ చల్ చేస్తున్నాయి. ప్రజలు కూడా వణికిపోతున్నారు. వజ్రపుకొత్తూరు మండలం, వంకలూరులో ఓ ఎలుగుబంటి ఏకంగా పనస చెట్టు ఎక్కింది. పనస పండు కోసం ఎలుగు చెట్టెక్కడంతో స్థానికులు భయంతో వణికిపోయారు. తర్వాత జనం భారీగా గుమిగూడడంతో ఎలుగు అక్కడి నుంచి అడవుల్లోకి పారిపోయింది. అయితే తరచుగా అక్కడ ఎలుగుబంట్లు కనిపిస్తుండడంతో స్థానికులు భయాందోళనకు గురౌతున్నారు. ముఖ్యమంగా మైదానం ప్రాంతాల్లోకి ఎలుగుబంట్లు రావడంతో ప్రజలు వణికిపోతున్నారు. జీడిమామిడి తోటల్లో పనులు చేసుకోవడానికి వెళ్లినవారిపై దాడులు చేస్తున్నాయి. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చినా.. పట్టించుకోవడంలేదని స్థానికులు వాపోయారు.

Updated Date - 2020-07-01T23:07:06+05:30 IST