గ్రామీణ మహిళలకు వరం

ABN , First Publish Date - 2021-07-26T03:13:45+05:30 IST

మెదక్‌ జిల్లాలోని గ్రామీణ మహిళా సంఘాల సభ్యులు, వారి కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు వారికి సుస్థిరమైన జీవనోపాధి కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం విలేజ్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసింది

గ్రామీణ మహిళలకు వరం
మెదక్‌లో జిరాక్స్‌ సెంటర్‌ను ప్రారంభించిన డీఆర్డీవో శ్రీనివాస్‌

విలేజ్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ పథకం

స్థిరమైన జీవనోపాధికి ప్రణాళిక

ప్రభుత్వ రుణాలతో స్వయం ఉపాధి


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మెదక్‌ జూలై 25: మెదక్‌ జిల్లాలోని గ్రామీణ మహిళా సంఘాల సభ్యులు,  వారి కుటుంబాలను ఆర్థికంగా  బలోపేతం చేయడంతో పాటు వారికి సుస్థిరమైన జీవనోపాధి కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం విలేజ్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసింది. విలేజ్‌ ఎంటర్‌ ప్రైజె్‌సలో భాగంగా గ్రామస్థాయిలో అక్కడి పరిస్థితులకు అనుగుణంగా వ్యాపారం చేయనున్నారు.  స్వయం సహాయక సంఘాల సభ్యులు వ్యాపారం చేసేందుకుగాను అవసరమైన రుణాలను ప్రభుత్వమే మంజూరు చేయనుంది. ఆ రుణాలను బ్యాంకులు, సెర్ప్‌, స్ర్తీనిధి ద్వారా తీసుకునేందుకు వెసులుబాటు కల్పించారు. మెదక్‌ జిల్లాలో విలేజ్‌ ఎంటర్‌ ప్రైజె్‌సలో భాగంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. జిల్లా యంత్రాంగం ఇప్పటికే విలేజ్‌ ఎంటర్‌ప్రైజె్‌సలను ప్రారంభించి అందుబాటులోకి తీసుకొచ్చింది. 


సభ్యులతో వేర్వేరు వ్యాపారాలు

ఒక గ్రామంలోని మహిళా సంఘాల సభ్యులు ఒకే రకమైన వ్యాపారం కాకుండా ఒక్కొక్కరు ఒక్కో వ్యాపారం చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో 20  మండలాల్లో 520 గ్రామసంఘాలు, 22వేల స్వయం సహాయక సంఘాలుండగా 2లక్షల మంది సభ్యులున్నారు.  వీరిలో 2,546 మంది సభ్యులను ఎంపిక చేశారు.


180 వ్యాపారాలు

మెదక్‌ జిల్లాలో విలేజ్‌ ఎంటర్‌ ప్రైజె్‌సలో భాగంగా ఉత్పత్తులు, ట్రేడింగ్‌, సేవా రంగాలకు సంబంధించి జిల్లాలోని 20 గ్రామీణ మండలాల్లో 180 రకాల వ్యాపారాలను మహిళా స్వయం సహాయక సభ్యులు చేసేందుకు నిర్ణయించారు.

    ఉత్పత్తి రంగంలో పేపర్‌ ప్లేట్లు, కుండలు, బేకరీ, ఇటుకలు, ఇస్తరాకులు, మగ్గం పనులు, పాపడ్‌, స్నాక్స్‌ యూనిట్‌, బిస్కెట్ల తయారీ, తట్టలు కట్టడం, రోటీ, అగర్‌బత్తి, క్యాండిల్‌, గుడ్డు ఆధారిత ఆహార ఉత్పత్తులు, స్టేషనరీ, ఫ్లోర్‌ క్లీనర్‌, అల్లంవెల్లుల్లి ఫేస్ట్‌, లెమన్‌ గ్రాస్‌, చట్నీ, రైస్‌ మిల్‌, బీడీ, డిటర్జెంట్‌ పౌడర్‌, పూజాసామగ్రి, చేనేత ఉత్పత్తి పరిశ్రమల వ్యాపారం చేసేందుకు నిర్ణయించారు.  

    ట్రేడింగ్‌ రంగంలో కిరాణ, వస్త్ర, గాజుల దుకాణం, కూరగాయలు, డెయిరీ, పౌల్ర్టీ, గుడ్ల వ్యాపారం, ఫర్టిలైజర్‌, హార్డ్‌వేర్‌, ఎలక్ర్టికల్‌ షాప్‌, బియ్యం, పప్పు వ్యాపారం, పూలు, పండ్లు, చేపలు, పాన్‌షా్‌ప, తదితర వ్యాపారాలను గుర్తించారు.

    సర్వీసు రంగంలో హోటల్‌, టిఫిన్‌, టైలరింగ్‌, మటన్‌, చికెన్‌ షాప్‌, సెలూన్‌, జిరాక్స్‌, పిండి గిర్నీ, వాటర్‌ ప్లాంట్‌, పాల వ్యాపారం, బ్యూటీ పార్లర్‌, ఇస్త్రీ దుకాణం, మొబైల్‌ ఫోన్‌ మెకానిక్‌, ఆటో రిక్షా కొనుగోలు, స్కూటర్‌, ఆటో మెకానిక్‌, బోర్‌వెల్‌ రిపేర్‌, ఎయిర్‌ పంపింగ్‌, పంక్చర్‌, సిమెంట్‌, కాంక్రీట్‌ మిక్చర్‌, మెడికల్‌ షాప్‌, టెంట్‌హౌజ్‌, వెల్డింగ్‌ షాప్‌, ఫొటో స్టూడియో తదితర వ్యాపారాలు చేసేందుకు జిల్లాలోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు ముందుకొచ్చారు. 


వ్యాపారాభివృద్ధికి దోహదం

-శ్రీనివాస్‌, డీఆర్డీవో, మెదక్‌

సంఘం మహిళలు వ్యాపారంలోకి అడుగుపెట్టేందుకు ప్రత్యేక రుణాలు దోహదపడతాయి. విలేజ్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ పథకం ద్వారా ఒక్కో గ్రామంలో కేవలం ముగ్గురికి మాత్రమే రుణాలు అందిస్తున్నాం. తద్వారా రుణాలు తీసుకున్న సభ్యులతో  వంద శాతం వ్యాపారాలు నిర్వహించేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలు కేవలం రుణాలు తీసుకోవడం, వాటిని వాయిదాల రూపంలో చెల్లించడానికే పరిమితమయ్యారు. ఆర్థిక లావాదేవీలు జరిగినప్పటికీ వ్యాపార ప్రగతి అనుకున్న స్థాయిలో జరగలేదు. విలేజ్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ పథకం ద్వారా మహిళల్లో వ్యాపారం నిర్వహించే సామర్థ్యా న్ని పెంచి భవిష్యత్తుకు రక్షణ కల్పించే వీలు దొరుకుతుంది.

Updated Date - 2021-07-26T03:13:45+05:30 IST