Viral News: మేనల్లుడే కదా అని ఇంటికి రానిస్తే.. 17ఏళ్ల యువకుడు చేసిన పని ఇదీ.. భార్య కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన భర్త!

ABN , First Publish Date - 2022-09-17T14:17:52+05:30 IST

ఆ యువకుడికి 17ఏళ్లు. మేనల్లుడే కదా అని ఆ యువకుడిని.. అతడు ఇంటికి రానిచ్చాడు. అంతేకాకుండా తన భార్యతో మేనల్లుడు సన్నిహితంగా మెలిగినా చూసి చూడనట్లు వదిలేశాడు. అదే అతడు చేసిన పొరపాటు అయింది. ఫలితంగా ఇప్పుడు అతడు భార్య

Viral News: మేనల్లుడే కదా అని ఇంటికి రానిస్తే.. 17ఏళ్ల యువకుడు చేసిన పని ఇదీ.. భార్య కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన భర్త!

ఇంటర్నెట్ డెస్క్: ఆ యువకుడికి 17ఏళ్లు. మేనల్లుడే కదా అని ఆ యువకుడిని.. అతడు ఇంటికి రానిచ్చాడు. అంతేకాకుండా తన భార్యతో మేనల్లుడు సన్నిహితంగా మెలిగినా చూసి చూడనట్లు వదిలేశాడు. అదే అతడు చేసిన పొరపాటు అయింది. ఫలితంగా ఇప్పుడు అతడు భార్య కోసం పోలీసు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి నెలకొంది. స్థానికంగా ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


రాజస్థాన్‌(Rajasthan)లోని బినాసర్ ప్రాంతానికి చెందిన వ్యక్తికి ప్రస్తుతం దాదాపు 40ఏళ్ల వయసు. సుమారు 10ఏళ్ల క్రితం అతడికి ఓ మహిళతో వివాహం జరిగింది. ఇప్పుడు అతడి భార్య(wife) వయసు 35ఏళ్లు. అతడికి ఓ మేనల్లుడు(nephew) కూడా ఉన్నాడు. ప్రస్తుతం అతడి వయసు 17ఏళ్లు కాగా.. తరచూ సదరు యువకుడు అతడి ఇంటికి వెళ్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే ఆ యువకుడికి తన మేనత్తతో సాన్నిహిత్యం బాగా పెరిగింది. ఈ విషయాం యువకుడి మేనమామ దృష్టికి వచ్చింది. అయినా అతడు(husband) లైట్ తీసుకున్నాడు. 



ఈ క్రమంలోనే మేనత్తకు, మేనల్లుడి మధ్య సాన్నిహిత్యం కాస్తా.. క్రమంగా ప్రేమగా మారింది. కొద్ది రోజులపాటు ప్రేమాయణం సాగించిన ఇద్దరూ.. తాజాగా పెళ్లి చేసుకుని కుటుంబ సభ్యులకు షాకిచ్చారు. దీంతో కంగుతిన్న అతడు.. కుటుంబ సభ్యులతో కలిసి ఇద్దరికీ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే.. అందుకు అతడి భార్య ససేమిరా అంది. చావైనా బతుకైనా తన రెండో భర్త(మేనల్లుడు)తోనే అని తెగేసి చెప్పింది. దీంతో అతడు పోలీస్ స్టేషన్‌ మెట్లెక్కాడు. ఇద్దరు పిల్లలను విడిచి తన భార్య రెండో వివాహం చెల్లదని పేర్కొంటూ ఇద్దరిపై అధికారులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం ఈ కేసు స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది. 


Updated Date - 2022-09-17T14:17:52+05:30 IST