తల్లిదండ్రులు కాబోతున్న Alia Bhatt, Ranbir కు శుభాకాంక్షలు చెబుతూనే.. ఓ కండోమ్ కంపెనీ వెరైటీ ప్రమోషన్..!

Published: Tue, 28 Jun 2022 15:35:42 ISTfb-iconwhatsapp-icontwitter-icon
తల్లిదండ్రులు కాబోతున్న Alia Bhatt, Ranbir కు శుభాకాంక్షలు చెబుతూనే.. ఓ కండోమ్ కంపెనీ వెరైటీ ప్రమోషన్..!

బాలీవుడ్ క్రేజీ కపుల్ అలియా భట్, రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) వివాహ బంధంతో ఒకటై దాదాపు రెండున్నర నెలలు అవుతోంది. తాజగా ఈ జంట తల్లిదండ్రులు కాబోతున్నట్లు శుభవార్తని తెలిపింది. ఈ విషయాన్ని చెబుతూ జూన్ 27న సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. అందులో.. అలియా సోనోగ్రఫీలో పాపని చూస్తుండగా.. పక్కనే ఉన్న రణ్‌బీర్ అక్కడే ఉన్నాడు. అయితే ఆయన ముఖం మాత్రం కనిపించలేదు. అలాగే.. స్క్రీన్‌పై బెబీ కనిపించకుండా పెద్ద లవ్ ఎమోజీని యాడ్ చేసింది. అంతేకాకుండా ఆ పోస్ట్‌కి.. ‘మా బెబీ.. త్వరలో రాబోతోంది’ అని క్యాప్షన్‌ సైతం రాసుకొచ్చింది.


అలియా గర్భవతి అయినట్లు తెలిసిన వెంటనే అభిమానులతో పాటు పలువురు సెలబ్రిటీలు సైతం ఆ జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు. అందులో.. ప్రముఖ కండోమ్ కంపెనీ డ్యూరెక్స్ (Durex) షేర్ చేసిన పోస్ట్ అన్నింటికంటే ఎక్కువగా అందరినీ ఆకర్షించింది. డ్యూరెక్స్ కంపెనీ పెట్టిన ఆ పోస్ట్‌లో.. ‘మీరు రంగంలో ఉన్నారు.. మేమైతే ఖచ్చితంగా లేము. కంగ్రాచ్యులేషన్స్’ అని ఎంతో ఫన్నీగా రాసుకొచ్చింది. అంతేకాకుండా ఆ పోస్ట్‌కి.. ‘జోమో నిజం. అలియా, రణ్‌బీర్‌కి అభినందనలు’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ఈ ఫన్నీ పోస్ట్‌పై పలువురు నెటిజన్లు స్పందిస్తూ వరుసగా కామెంట్స్ చేస్తున్నారు. ‘సూపర్ బ్రాండ్‌, ‘మార్కెటింగ్ మామూలుగా లేదు’, ‘చాలా ఫన్నీగా ఉంది’, ‘వెరైటీ ప్రమోషన్’ అంటూ రాసుకొస్తున్నారు.  


అయితే.. రణ్‌బీర్ నటించిన తాజా చిత్రం ‘షంషేరా (Shamshera)’ జూలై 22న విడుదలకానుంది. అలాగే.. ఈ నూతన దంపతులు కలిసి నటించిన ‘బ్రహ్మాస్త్ర’ సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే.. అలియా సైతం ‘వండర్ వుమెన్’ ఫేమ్ గాల్ గాడెట్‌తో కలిసి ‘హార్ట్ ఆఫ్ స్టోన్‌’ అనే హాలీవుడ్ మూవీలో నటిస్తోంది. ప్రెగ్నెన్సీ మొదటి దశలో ఉండడంతో ఈ బ్యూటీ తన కమిట్‌మెంట్స్ అన్నింటినీ త్వరగా పూర్తి చేసే పనిలో పడిందని తెలుస్తోంది.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest News in Teluguమరిన్ని...