ఉద్దేశపూర్వకంగా వృద్ధుడిని కారుతో ఢీకొట్టిన పొరుగింటాయన

Published: Thu, 31 Mar 2022 13:28:17 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఉద్దేశపూర్వకంగా వృద్ధుడిని కారుతో ఢీకొట్టిన పొరుగింటాయన

న్యూఢిల్లీ : చిన్న చిన్న వివాదాలు కక్షసాధింపు చర్యలకు ఎలా దారి తీస్తాయో తెలుసుకోవడానికి ఇదొక ఉదాహరణ. ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఇరుగు, పొరుగువారు ఆరు నెలల క్రితం గొడవ పడ్డారు. తాజాగా ఇంటి ముందు కుర్చీలో కూర్చోవడానికి ప్రయత్నిస్తున్న వృద్ధుడిని ఆ పొరుగింటాయన కారుతో ఢీకొట్టి, పారిపోయాడు. ఈ దారుణం సీసీటీవీలో రికార్డయింది. 


సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపిస్తున్న దృశ్యాల ప్రకారం, ఓ చిన్న వీథిలో ఉంటున్న ఓ వృద్ధుడు తన ఇంటి ముందు కుర్చీలో కూర్చునే ప్రయత్నం చేస్తుండగా, ఆ పొరుగింటాయని కారులో వచ్చి, ఆ కుర్చీని, ఆ వృద్ధుడిని ఢీకొట్టి, పారిపోయాడు. ఈ దారుణాన్ని గమనించినవారు ఆ కారును వెంబడించారు. మరో ఇద్దరు వ్యక్తులు ఆ వృద్ధునికి సపర్యలు చేశారు. 


బాధిత వృద్ధుడు మాట్లాడుతూ, ఆ కారు డ్రైవర్ ఉద్దేశపూర్వకంగానే తనను ఢీకొట్టి పారిపోయాడని చెప్పారు. ఆయన తన పొరుగింటి వ్యక్తేనని, తమ మధ్య ఆరు నెలల క్రితం గొడవ జరిగిందని చెప్పారు. మార్చి 30న ఉదయం జరిగిన ఈ సంఘటనపై ఆ వృద్ధుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉంది. Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.