Donkey: తెలివి అంటే మనోడిదే.. ఈ గాడిదపై సోలార్ పానెల్‌ను కట్టడం వెనుక కథేంటో తెలిస్తే..

ABN , First Publish Date - 2022-09-21T00:35:13+05:30 IST

ఎవర్నైనా తిట్టాలంటే `గాడిదలు కాస్తున్నావా ఏంటీ` అని తిడుతుంటారు

Donkey: తెలివి అంటే మనోడిదే.. ఈ గాడిదపై సోలార్ పానెల్‌ను కట్టడం వెనుక కథేంటో తెలిస్తే..

ఎవర్నైనా తిట్టాలంటే `గాడిదలు కాస్తున్నావా ఏంటీ` అని తిడుతుంటారు. అయితే గాడిదలు (Donkeys) కాసే వాళ్లని అంత తేలిగ్గా తీసిపారెయ్యకూడదు అని నిరూపించాడు ఓ యువకుడు. అవసరం సరికొత్త ఆవిష్కరణలకు కారణమవుతుందని అంటుంటారు. అది నిజమేనని అతడు నిరూపించాడు. తెలంగాణా (Telangana)లోని నారాయణ్‌పేట్‌కు చెందిన ఆ యువకుడు సమీప అడవిలో గాడిదలు కాస్తుంటాడు. అలా వెళ్లినపుడు తన సెల్‌ఫోన్‌కి చార్జింగ్ (Cell Phone Charging) పెట్టుకోవడానికి వీలు కావడం లేదు. అలాగే తిరిగి వచ్చే సమయంలో చీకటి పడటంతో దారి కనిపించడం లేదు. ఆ సమస్యలను పరిష్కరించే క్రమంలో అతడు కొత్తగా ఆలోచించాడు. 


ఇది కూడా చదవండి..

అదే పనిగా ఎమర్జెన్సీ హారన్‌ను మోగిస్తున్న లోకో పైలట్.. ఏం జరిగిందో తెలియక ప్రయాణీకుల్లో టెన్షన్.. చివరకు..


నారాయణపేట జిల్లా జక్లేర్‌కు చెందిన హుస్సేనప్ప అనే ఓ యువకుడు రోజూ గాడిదలను నల్లమల అడవికి తీసుకెళ్తుంటాడు. అయితే అడవిలో తన సెల్‌ఫోన్‌కి చార్జింగ్ సౌకర్యం లేకపోవడం, తిరిగి చీకటిలో రావడం అతడికి పెద్ద సమస్యగా మారింది. దీంతో బాగా ఆలోచించి ఓ పరిష్కార మార్గం కనుగొన్నాడు. గాడిదలపై సోలార్ ప్లేట్స్‌ పెట్టి  వాటి ద్వారా బ్యాటరీని ఛార్జ్ చేస్తున్నాడు. ఆ బ్యాటరీతో తన సెల్‌ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడమే కాకుండా, చీకటి సమయంలో లైటింగ్ సమస్యను కూడా పరిష్కరించుకున్నాడు. అంతేకాదు రోజూ బియ్యం, పప్పు దినుసులు తీసుకెళ్లి కరెంట్ కుక్కర్ సహాయంతో అడవిలోనే వండుకుంటున్నాడు. హుస్పేనప్పను, అతడి గాడిదలను చూసిన కొందరు అతడి తెలివితేటలను మెచ్చుకుని ఆ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

Updated Date - 2022-09-21T00:35:13+05:30 IST