స్నేహితుడని నమ్మి వెళ్తే దారుణం.. బీరులో మూత్రం పోసి తాగించి అకృత్యం.. చివరకు..

ABN , First Publish Date - 2022-04-23T22:03:10+05:30 IST

ఆ యువకుడు ఫోన్ కొనడానికని రూ.10 వేలు తీసుకుని బయల్దేరాడు.. మార్గమధ్యంలో ఓ స్నేహితుడు కలిశాడు..

స్నేహితుడని నమ్మి వెళ్తే దారుణం.. బీరులో మూత్రం పోసి తాగించి అకృత్యం.. చివరకు..

ఆ యువకుడు ఫోన్ కొనడానికని రూ.10 వేలు తీసుకుని బయల్దేరాడు.. మార్గమధ్యంలో ఓ స్నేహితుడు కలిశాడు.. అతడితో మాట్లాడుతూ రూ.10 వేలతో ఫోన్ కొనడానికి వెళ్తున్నానని చెప్పాడు.. ఆ యువకుడికి మాయ మాటలు చెప్పి తనతో పాటు తీసుకెళ్లిన స్నేహితుడు దుర్మార్గంగా ప్రవర్తించాడు.. మరో స్నేహితుడితో కలిసి అమానవీయంగా ప్రవర్తించాడు.. కులం పేరుతో దూషిస్తూ అతడిని చితక్కొట్టి రూ.10 వేలు తీసుకుని పరారయ్యాడు. 


హర్యానాలో రేవారి జిల్లాలోని ఓ గ్రామంలో షెడ్యూల్డ్ కులానికి చెందిన యువకుడిపై జరిగిన అఘాయిత్యం తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. బాధితుడిని అతని సొంత గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు దారుణంగా అవమానించారు. బాధితుడి జేబులో రూ.10 వేలు ఉన్నట్టు తెలుసుకుని గ్రామ శివార్లలోకి తీసుకెళ్లారు. అతడిని అక్కడ ఓ స్థంభానికి కట్టేసి కొట్టారు. అనంతరం బీరులో మూత్రం పోసి తాగించారు. అనంతరం బాధితుడి జేబులో ఉన్న రూ.10 వేలు, పాత మొబైల్ తీసుకుని పారిపోయారు. 


ఈ ఘటన గురించి ఎవరికైనా చెబితే చంపేస్తామని హెచ్చరించారు. షెడ్యూల్డ్ కులానికి చెందిన ఆ యువకుడిని కులం పేరుతో దూషించారు. అక్కడి నుంచి తప్పించుకున్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపులు చేపట్టారు. 

Updated Date - 2022-04-23T22:03:10+05:30 IST