నిర్లక్ష్యం వహించిన వారిపై కేసు నమోదు చేయాలి

ABN , First Publish Date - 2021-06-23T06:22:50+05:30 IST

కరీంనగర్‌ మాతా శిశు కేంద్రంలో వేరొకరికి చేయవలసిన శస్త్ర చికిత్స మాలతి అనే గర్భిణికి చేసిన వైద్య సిబ్బందిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసి, విధుల నుంచి తప్పించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి డిమాండ్‌ చేశారు.

నిర్లక్ష్యం వహించిన వారిపై  కేసు నమోదు చేయాలి
మాతా శిశు ఆరోగ్య కేంద్రం ముందు ధర్నా చేస్తున్న బీజేపీ నాయకులు

- బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి

- మాతా శిశు ఆరోగ్య కేంద్రం ఎదుట ధర్నా 

సుభాష్‌నగర్‌, జూన్‌ 22: కరీంనగర్‌ మాతా శిశు కేంద్రంలో వేరొకరికి చేయవలసిన శస్త్ర చికిత్స మాలతి అనే గర్భిణికి చేసిన వైద్య సిబ్బందిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసి, విధుల నుంచి తప్పించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి డిమాండ్‌ చేశారు.  మాతా శిశు కేంద్రంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో వీణవంక మండలం నర్సింగాపూర్‌ గ్రామానికి చెందిన మాలతి అనే గర్భిణికి అనవసర శస్త్ర చికిత్స చేశారు. దీంతో ఆమె తీవ్ర అనారోగ్యం పాలైంది. ఈ ఘటనపై బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం మాతా శిశు సంరక్షణ కేంద్రం ఎదుట నిరసన చేపట్టారు. బాధితురాలు మాలతిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణి మాలతికి నష్టపరిహారం చెల్లించడంతోపాటు డెలివరీ అయ్యే వరకు ప్రభుత్వమే ఆమె బాధ్యత తీసుకొని వారి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు చొప్పరి జయశ్రీ, కరీంనగర్‌ అసెంబ్లీ కన్వీనర్‌ దుబాల శ్రీనివాస్‌, నాయకులు రాజిరెడ్డి, వైద రామానుజం, నరహరి లక్ష్మారెడ్డి, అవుదుర్తి శ్రీనివాస్‌, ఎండీ జమాల్‌, వేదం శిల్ప, గొట్టెముక్కల ఉమారాణి, మామిడి చైతన్య, రమాదేవి, మాడుగుల ప్రవీణ్‌ కుమార్‌, గంగిశెట్టి రాజు, మాసం గణేశ్‌, రవీందర్‌ రెడ్డి, సాయివైష్ణవి, లావణ్య, కన్నాంబ, సునీత, సంగీత, అభిలాశ్‌, కైలాస్‌, నవీన్‌, మునీందర్‌, కళకోట మోహన్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-06-23T06:22:50+05:30 IST