వలంటీర్‌ చీటింగ్‌పై కేసు సమోదు చేయాలి

ABN , First Publish Date - 2022-09-23T05:40:25+05:30 IST

తన భూమిని మోసపూరితంగా కాజేయాలని ప్రయత్నించిన వలంటీర్‌ ఓ గులూరి శ్రీనివాసరావుతో పాటుగా, అతనికి సహకరించిన వెంకటేశ్వర్లుపై కేసు నమోదు చేయాలని బాధిత రైతు గురువారం ఎస్పీ మలికగర్గ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.

వలంటీర్‌ చీటింగ్‌పై కేసు సమోదు చేయాలి

ఎస్పీకి విన్నవించిన బాధితుడు


ఒంగోలు(క్రైం), సెప్టెంబరు 22: తన భూమిని మోసపూరితంగా కాజేయాలని ప్రయత్నించిన వలంటీర్‌ ఓ గులూరి శ్రీనివాసరావుతో పాటుగా, అతనికి సహకరించిన వెంకటేశ్వర్లుపై కేసు నమోదు చేయాలని బాధిత రైతు గురువారం ఎస్పీ మలికగర్గ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బాధిత రైతు చొప్పవరపు వెంకటేశ్వర్లు తన ఆవేదనను తెలియజేశారు. ముండ్లమూరు మండలం పూరిమెట్ల గ్రామానికి చెందిన త నకు నాయుడుపాలెం పరిధిలోని తుమ్మలూరులోని సర్వేనంబర్‌ 75-1లో ఉన్న 2.82 ఎకరాల భూమి ఉంద ని, దానిని కాజేసేందుకు తమ్మలూరు వలంటీర్‌ ఓగులూరు శ్రీనివాసరావు ప్రణాళిక రూపొందించాడని, చె ప్పారు. అందుకు తమ్మలూరుకే చెందిన చొప్పవరపు వెంకటేశ్వర్లు పేరుతో పట్టాదారు పాస్‌పుస్తకాన్ని తన ప లుకుబడి ఉపయోగించి తెచ్చాడన్నారు. ఈనెల 20న దర్శి సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయంలో భూమిని రిజిస్టర్‌ చే యించాడని తెలిపారు. అయితే వీర్వో ద్వారా విషయం తెలిసి నిలదీయడంతో వెంటనే ఆ రిజిస్టర్‌ను రద్దు చే సుకున్నారని వివరించారు. సుమారు రూ.20లక్షలు విలువ చేసే భూమిని మోసం చేసి అన్యాక్రాంతం చేయా లని ప్రయత్నించిన వలంటీర్‌పై కేసు నమోదుకు ముండ్లమూరు ఎస్సైకి విన్నవించామని, అయితే ఆయన మోసం చేసిన వలంటీర్‌కే వంతపాడుతూ తమకు న్యాయం చేయలేదని వాపోయారు. డివిజన్‌ స్థాయి ఉ న్నతాధికారుల అండ తనకు ఉందంటూ ఎస్‌ఐ అసలు పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైనా సంబంధిత వలం టీర్‌పై కేసు నమోదు చేయించి, ఎస్సైపై చర్యలు తీసుకోవాలని బాధితుడు వెంకటేశ్వర్లు కోరినట్లు తెలిపారు. ఈ మేరకు దర్శి సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ను విచారించాల్సిందిగా ఎస్పీ ఆదేశించారు. 


Updated Date - 2022-09-23T05:40:25+05:30 IST