చేనేతలను ఆగం చేస్తున్న కేంద్రం

ABN , First Publish Date - 2022-08-08T04:45:11+05:30 IST

నేత కార్మికులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుంటే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ విధించి వారికి అన్యాయం చేస్తోందని ఆబ్కారి శాఖ శాఖ మంత్రి డాక్టర్‌ వి. శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు.

చేనేతలను ఆగం చేస్తున్న కేంద్రం
ప్రతిజ్ఞ చేయిస్తున్న మంత్రి డాక్టర్‌ వి. శ్రీనివాస్‌గౌడ్‌

- ఎక్సైజ్‌ శాఖ మంత్రి డాక్టర్‌ వి. శ్రీనివాస్‌గౌడ్‌

- బతుకమ్మ చీరల తయారీతో చేనేతలకు అండగా సీఎం 

-  ప్రతీ ఒక్కరు చేనేత దుస్తులు ధరించాలి

మహబూబ్‌నగర్‌ టౌన్‌, ఆగస్టు 7 : చేనేత కార్మికులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుంటే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ విధించి వారికి అన్యాయం చేస్తోందని ఆబ్కారి శాఖ శాఖ మంత్రి డాక్టర్‌ వి. శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. సమైక్య రాష్ట్రంలోనూ చేనేత కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోలేదన్నారు. స్వరాష్ట్రంలో  సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించి చేనేతను బతికించేందుకు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. జడ్పీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జాతీయ చేనేత దినోత్సవ ఉత్సవా లను జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యంత్రాల ద్వారా దుస్తులు నేయడం వల్ల నేతన్న ఉపాధికి గండి పడింద న్నారు. రైౖతుబీమా మాదిరిగానే చేనేత కార్మికులకు సైతం రూ.5 లక్షల ప్రమాద బీమా ఇస్తున్నామన్నారు. వృత్తిని బతికించేందుకు జీఎస్టీ రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. చేనేత కార్మికులకు అండగా ఉండేందుకు ఇకపై ప్రతీ ఒక్కరు వారానికి ఒకసారైనా చేనేత దుస్తులు ధరించాలని కోరారు. నిత్యం చేనేత దుస్తులు ధరించే ఉద్యోగులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలని కలెక్టర్‌ వెంకట్రావును మంత్రి ఆదేశించారు. గద్వాల, నారాయణపేట, కొత్తకోట, కోటకొండ చేనేత చీరలు, గొంగళ్లు, ఇతర చేనేత ఉత్పత్తులు అన్ని ఒకేచోట లభించేలా జిల్లా కేంద్రంలో ప్రత్యేక స్టాల్‌ ఏర్పాటు చేసేందుకు స్థలం కేటాయిం చాలని అధికారులను ఆదేశించారు. అనంతరం అధికారులతో సమావేశానికి వ చ్చిన వారితో మంత్రి చేనేత ప్రతిజ్ఞ చేయించారు. ఇదే కార్యక్రమంలో శ్రీలక్ష్మీ వెంకటేశ్వర చేనేత సహకార జాతీయ సంఘానికి రూ. 12,38,960 విలువైన ప  వడ్డీ చెక్కును మంత్రి పంపిణీ చేసి చేనేత కార్మికులను మంత్రి సన్మానించారు. కలెక్టర్‌ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు, మునిసిపల్‌ చైర్మన్‌ కేసీ నర్సింహులు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రెహమాన్‌, అడిషనల్‌ కలెక్టర్‌ సీతారామారావు, డీఎస్పీ మహేష్‌, చేనేత, జౌళీ శాఖ ఏ.డి.బాబు, డీఈవో రవీందర్‌, ఆర్డీవో అనిల్‌ కుమార్‌, వెటర్నరిజేడీ మఽధుసూదన్‌గౌడ్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-08T04:45:11+05:30 IST