పేద ప్రజలపై భారం మోపుతున్న కేంద్రం

ABN , First Publish Date - 2021-03-07T05:11:56+05:30 IST

కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరలను పెంచి పేద ప్రజలపై భా రం మోపిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి సు దర్శన్‌రెడ్డి అన్నారు.

పేద ప్రజలపై భారం మోపుతున్న కేంద్రం
సైకిల్‌ ర్యాలీని ప్రారంభిస్తున్న సుదర్శన్‌రెడ్డి

మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి

నిజామాబాద్‌ అర్బన్‌, మార్చి 6: కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరలను పెంచి పేద ప్రజలపై భా రం మోపిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి సు దర్శన్‌రెడ్డి అన్నారు. నిజామాబాద్‌లో కాంగ్రెస్‌ నగర కమిటీ ఆధ్వర్యంలో ధరల పెంపుకు నిరసనగా శనివారం సైకిల్‌ ర్యా లీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. ప్రధాని మోదీ ఎన్నికల సమయంలో ఎన్నో వాగ్దానా లు చేసి వాటిని విస్మరించారన్నారు. పేదల బతుకులు మా రుస్తానని చెప్పి ప్రస్తుతం వారిపైన మోయలేని భారాన్ని మోపుతున్నారన్నారు. యూపీఏ హయాంలో పెట్రోల్‌, డీజి ల్‌, వంటగ్యాస్‌ ధరలను ఇంతగా పెంచలేదన్నారు. ఎన్‌డీఏ అధికారంలోకి రాగానే ధరలను భారీగా పెంచుతుందన్నారు. పెట్రోల్‌, డిజీల్‌ ధరలు పెరగడం వల్ల అవి ఇతర రంగాలపై పడి పేదలు మోయలేనివిధంగా అధిక భారం పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు మానా ల మోహన్‌రెడ్డి  నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు కేశవేణు, పీసీసీ కార్యదర్శి నగేష్‌రెడ్డి, కిసాన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ముప్ప గం గారెడ్డి, యువజన కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి రామర్తి గోపి, మైనార్టీ జిల్లా అధ్యక్షుడు ఇర్ఫాన్‌అలీ, జిల్లా కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్ధి దయాకర్‌గౌడ్‌, ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు వేణురా జ్‌, కార్పొరేటర్‌ గడుగు రోహిత్‌, యువజన కాంగ్రెస్‌ అధ్యక్షు డు ప్రీతం, యువజన కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు జాహిద్‌బిన్‌ హుందాన్‌, నగర కాంగ్రెస్‌ ఉపాద్యక్షుడు శివకుమార్‌, మాజీ కార్పొరేటర్‌ కేశ మహేష్‌, నేతలు ఎజాజ్‌, దత్తు, జావిద్‌ అ క్రం, నర్సింగ్‌ తదితరులు పాల్గొన్నారు. 

అలీసాగర్‌ చివరి ఆయకట్టుకు నీటిని అందించాలి

నవీపేట: యాసంగికి సంబంధించి అలీసాగర్‌ చివరి ఆ యకట్టుకు సాగునీటిని పంటలకు సక్రమంగా అందించాలని మాజీమంత్రి సుదర్శన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. శనివారం మండల కేంద్రంలోని నవీపేట, రెంజల్‌ మండలాలకు చెంది న కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొ న్నారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లా డుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అలీసాగర్‌ ఎత్తిపోతల పథకం ద్వారా చివరి ఆయకట్టుకు సాగునీరు స క్రమంగా అందడం లేదని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హ యాంలో ఉమ్మడి జిల్లాలో చేపట్టిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజె క్టు పనులను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయ కులు కెప్టెన్‌ కరుణాకర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షులు మానాల మో హన్‌రెడ్డి, గంగారెడ్డి, నవీపేట, రెంజల్‌ మండ లాలకు చెంది న నాయకులు శ్రీనివాస్‌గౌడ్‌, రాజేందర్‌గౌడ్‌, సుధాకర్‌రావు, జె.రాంచందర్‌, ఎస్‌కే బాబు, ఒడ్డె రవి పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-07T05:11:56+05:30 IST