Viral Video:వామ్మో.. వీడేం డ్రైవర్ బాబోయ్.. ఆటోను నడిపిన తీరు చూస్తే అవాక్కవడం ఖాయం..!

ABN , First Publish Date - 2021-10-08T22:23:37+05:30 IST

బైక్ రైడర్లు తమ తమ బైక్‌లతో రకరకాల విన్యాసాలు చేస్తూ ప్రజలు, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు. కాగా.. బైక్ రైడర్లు చేసే స్టంట్‌లకు సంబంధించిన వీడియోలను ఇప్పటి

Viral Video:వామ్మో.. వీడేం డ్రైవర్ బాబోయ్.. ఆటోను నడిపిన తీరు చూస్తే అవాక్కవడం ఖాయం..!

ఇంటర్నెట్ డెస్క్: బైక్ రైడర్లు తమ తమ బైక్‌లతో రకరకాల విన్యాసాలు చేస్తూ ప్రజలు, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు. కాగా.. బైక్ రైడర్లు చేసే స్టంట్‌లకు సంబంధించిన వీడియోలను ఇప్పటి వరకూ చాలానే చూశాం. కానీ ఓ ఆటో డ్రైవర.. ఆటోతో స్టంట్‌లు చేయడాన్ని బహుశా ఇప్పటి వరకూ ఎవరూ చూసుండరు. ఏంటి.. ఆటోతో స్టంట్‌లా! అని ఆశ్చర్యపోతున్నారా. అవును ఓ వ్యక్తి తన ఆటోతో స్టంట్ చేసి.. ఏకంగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో ఆ ఆటో డ్రైవర్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 



చెన్నైకి చెందిన ఎం జగదీశ్.. కొన్నేళ్లుగా ఆటో నడుపుతూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆటోను నడపడంలో అతడు మంచి నైపుణ్యం సంపాధించాడు. మూడు చక్రాల ఆటోను.. కేవలం రెండు చక్రాల మీదే అతడు నడపగలడు. ఈ నేపథ్యంలోనే జగదీశ్.. గిన్నీస్ రికార్డు ప్రతినిధుల ముందు తన ప్రతిభాపాటవాలను ప్రదర్శించాడు. ఆటోను కేవలం రెండు చక్రాల మీదే ఏకంగా 2.2 కిలోమీటర్ల దూరం నడిపి ఔరా! అనిపించాడు. దీంతో జగదీశ్ పేరు గిన్నీస్ వరల్డ్ రికార్డులోకి ఎక్కింది. జగదీశ్ ఈ రికార్డును 2016లోనే నెలకొల్పగా.. గిన్నీస్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు ఆ వీడియోను తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో నెట్టింట హచ్ చల్ చేస్తోంది. దీనిపట్ల స్పందిస్తున్న నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.  






Updated Date - 2021-10-08T22:23:37+05:30 IST