కోవిడ్ వ్యాప్తిని కట్టడి చేసే చూయింగ్ గమ్!

Published: Wed, 08 Dec 2021 16:11:24 ISTfb-iconwhatsapp-icontwitter-icon
కోవిడ్ వ్యాప్తిని కట్టడి చేసే చూయింగ్ గమ్!

న్యూఢిల్లీ : కోవిడ్ వ్యాప్తిని నియంత్రించగలిగే ఓ చూయింగ్ గమ్‌ను అభివృద్ధిపరచినట్లు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మొక్కల నుంచి సేకరించిన ప్రొటీన్‌తో దీనిని తయారు చేశామని, లాలాజలంలో SARS-CoV-2 వైరస్‌ను ఈ ప్రొటీన్ పరిమితం చేయగలదని చెప్తున్నారు. ఈ వైరస్ ఇన్ఫెక్షన్‌కు గురైన వ్యక్తి దగ్గినా, తుమ్మినా, మాట్లాడినా వెలువడే తుంపర్లలో ఈ వైరస్ పరిమితంగా ఉండేలా ఈ చూయింగ్ గమ్ ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఈ అధ్యయన నివేదిక ‘మాలెక్యులార్ థెరపీ’ జర్నల్‌లో ప్రచురితమైంది. 


అమెరికాలోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త హెన్రీ డానియెల్ ఈ అధ్యయనానికి నేతృత్వం వహించారు. హెన్రీ మాట్లాడుతూ, లాలాజల గ్రంథుల్లో SARS-CoV-2 పునరుత్పత్తి అవుతుందన్నారు. ఇన్ఫెక్షన్‌కు గురైన వ్యక్తి దగ్గినా, తుమ్మినా, మాట్లాడినా కొంత వైరస్ బయటకు వచ్చి, ఇతరులను చేరుతుందని మనందరికీ తెలుసునన్నారు. ఈ చూయింగ్ గమ్‌ను వాడటం వల్ల లాలాజలంలో ఈ వైరస్‌ను మట్టుబెట్టే అవకాశం ఉంటుందన్నారు. దీనిని వాడటం వల్ల వ్యాధి వ్యాప్తి చెందే మూల స్థానం నుంచి ఆ వ్యాప్తిని నిలువరించే అవకాశం కలుగుతుందని చెప్పారు. 


కోవిడ్-19 మహమ్మారికి ముందు హెన్రీ డానియెల్ హైపర్‌టెన్షన్ చికిత్స కోసం యాంజియోటెన్సిన్-కన్వెర్టింగ్ ఎంజైమ్ 2 (ఏసీఈ2) ప్రొటీన్‌పై అధ్యయనం చేసేవారని, ల్యాబ్‌లో ఈ ప్రొటీన్‌ను పెంచారని పరిశోధకులు తెలిపారు. పేటెంటెడ్ ప్లాంట్ బేస్డ్ ప్రొడక్షన్ సిస్టమ్‌లో దీనిని తయారు చేశారు. ప్రొటీన్ డ్రగ్ సింథసిస్‌కు సాధారణంగా ఉండే అడ్డంకులను ఈ విధానంలో నివారించే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ చూయింగ్ గమ్‌ను పరీక్షించేందుకు ఈ శాస్త్రవేత్తల బృందం ఏసీఈ2ను మొక్కల్లో వృద్ధి చేశారు. కోవిడ్-19 రోగుల నుంచి సేకరించిన లాలాజలాన్ని ఏసీఈ2 గమ్‌తో కలిపి చూశారు. వైరల్ ఆర్ఎన్ఏ స్థాయి నాటకీయ స్థాయిలో తగ్గినట్లు గమనించారు. ప్రస్తుతం ఈ పరిశోధకుల బృందం ఈ చూయింగ్‌ గమ్‌తో క్లినికల్ ట్రయల్స్‌ నిర్వహించేందుకు అనుమతి కోసం ప్రయత్నిస్తోంది. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.