Viral Video: వీడి హోలీ మామూలుగా లేదుగా.. రంగులు చల్లకుండా ఏకంగా... వామ్మో...

Published: Sat, 19 Mar 2022 21:31:13 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Viral Video: వీడి హోలీ మామూలుగా లేదుగా.. రంగులు చల్లకుండా ఏకంగా... వామ్మో...

హోలీ సందర్భంగా శుక్రవారం దేశ వ్యాప్తంగా సంబరాలు ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. చిన్నా, పెద్దా తేడా లేకుండా అంతా రంగులు చల్లుకుంటూ ఉల్లాసంగా గడిపారు. ఇక చిన్నపిల్లల సందడి గురించి చెప్పాల్సిన పనే లేదు. హోలీ రోజు వారిలో ఎప్పుడూ లేని ఆనందం చూడొచ్చు. రంగులు చల్లుకోవడమంటేనే సరదా.. అందులో హోలీ.. ఇంకేముందీ! ఉదయం నుంచీ రాత్రి వరకూ రంగుల్లో మునిగి తేలుతుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉంది కాబట్టి.. రంగులు చల్లుకునే సమయంలో ఇలా వీడియో తీసి, అలా పోస్టు చేస్తుంటారు. ఇలాంటి ఎన్నో వీడియోలు తరచూ చూస్తూనే ఉంటాం. తాజాగా హోలీ సందర్భంగా ఓ చిన్న పిల్లాడు రంగులు చల్లే వీడియో వైరల్ అవుతోంది.

ఇన్‌స్టాగ్రాంలో వైరల్ అవుతున్న వీడియోలో హోలీ సందర్భంగా కొందరు చిన్న పిల్లలు, పెద్దలు గుంపుగా చేరి రంగులు చల్లుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో ఓ పిల్లాడి వద్ద రంగులు అయిపోతాయి. దీంతో అతడి మీద అంతా రంగులతో దాడి చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరున్నా.. తిరిగి వారి మీద రంగులు చల్లి ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నిస్తుంటారు. ఈ బుడ్డోడు కూడా అలాగే చేయాలని చూశాడు. కానీ అతడి వద్ద రంగులు మాత్రం లేవు. ఏం చేయాలా అని ఆలోచించి, చివరకు పక్కనే ఉన్న మురికి కాలువ వద్దకు వెళ్లాడు. తన వద్ద ఉన్న గన్‌తో మురికి నీరు మొత్తం లాక్కున్నాడు. పక్కన ఉన్న వారికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. వారంతా అలా ఆలోచిస్తుండగానే.. మురికినీటిని వారిపై స్ప్రే చేసుకుంటూ వెళ్తాడు. దెబ్బకు అంతా షాక్ అవుతారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

‘‘గుడ్ టచ్, బ్యాడ్ టచ్’’పై క్లాసులో చెబుతుండగా.. పైకి లేచిన బాలిక.. తండ్రి, సోదరుడు, తాత, మామ గురించి ఆమె చెప్పింది విని..



ఇవి కూడా చదవండిLatest News in Telugu

మేడమ్! మసాజ్ చేయించుకుంటే సమస్యలు దూరమవుతాయ్.. అంటూ టూరిస్ట్‌తో అన్నాడు.. గదిలోకి వెళ్లిన కాసేపటికి చూస్తే..యువకులంతా కలిసి డ్యాన్స్ వేస్తున్నారులే అనుకుంటే.. చివరికి ఇలా జరిగిందేంటి.. ఎంత పని చేశావు తమ్ముడు.. videoViral Video: తినేటప్పుడు అడిగితే చిర్రెత్తుకొస్తుంది మరి.. ఈ చింపాంజి వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు..videoమగువలుగా మగవారు.. ఈ వింత ఆచారం ఎక్కడో, ఎందుకో తెలుసా.. తీవ్రమైన కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన పేషంట్.. వీధి రౌడీలా మారిన వైద్యుడు.. కనీసం కనికరం కూడా లేకుండా.. videoభార్యకు టిఫిన్ తినిపించి, లాడ్జికి తీసుకెళ్లిన భర్త.. కానీ మాట్లాడే క్రమంలో చివరకు ఇంత పని చేస్తాడనుకోలేదు..
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.