భవానీకి హాకీ స్టిక్ బహూకరిస్తున్న కలెక్టర్
ఎలమంచిలి, జూలై 2 : అంతర్జాతీయ హాకీ క్రీడాకారిణి మడుగుల భవానీని అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి శనివారం అభినందించారు. పట్టణంలోని ధర్మవరానికి చెందిన భవానీ తన తల్లిదండ్రులు, హాకీ క్రీడాకారులతో కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. క్రీడాకారిణితో ఆయన మాట్లాడుతూ క్రీడల్లో మరింత రాణించాలని ఆయన ఆకాంక్షించారు. స్థానిక హాకీ క్లబ్ చైర్మన్ ఆడారి వీరునాయుడు కలెక్టర్‌కు ఎలమంచిలిలో హాకీ అకాడమీ ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు. అనంతరం భవానీకి కలెక్టర్ అత్యంత విలువైన హాకీ స్టిక్‌ను బహూకరించారు. హాకీ క్లబ్ అధ్యక్షుడు నరసింహారావు, ప్రతినిధులు మహేష్, సాయి, క్రీడాకారులు రూపేష్, శివ తదితరులు పాల్గొన్నారు.