కళాశాల అభివృద్ధికి సంపూర్ణ తోడ్పాటు

ABN , First Publish Date - 2022-08-19T05:22:36+05:30 IST

గ్రామీణ ప్రాంతంలో ఉన్నప్పటికీ ఎంఏఎల్‌డీ కళాశాలలో సౌకర్యాలు, జరుగుతున్న అభివృద్ధి సంతృప్తినిచ్చిందన్న న్యాక్‌ పీర్‌ కమి టీ చైర్మన్‌ డాక్టర్‌ రాకేష్‌ గుప్తా, భవిష్యత్‌లో కళాశాల అభివృద్ధికి సలహాలు, సూచనలు అందిస్తూ, సంపూర్ణ తోడ్పాటునిస్తామన్నారు.

కళాశాల అభివృద్ధికి సంపూర్ణ తోడ్పాటు
సమావేశంలో మాట్లాడుతున్న న్యాక్‌ పీర్‌ కమిటీ చైర్మన్‌ డాక్టర్‌ రాకేష్‌ గుప్తా

- న్యాక్‌ పీర్‌ కమిటీ చైర్మన్‌ డాక్టర్‌ రాకేష్‌ గుప్తా

- ముగిసిన ఎంఏఎల్‌డీ కళాశాల పరిశీలన

గద్వాల టౌన్‌, ఆగస్టు 18 : గ్రామీణ ప్రాంతంలో ఉన్నప్పటికీ ఎంఏఎల్‌డీ కళాశాలలో సౌకర్యాలు, జరుగుతున్న అభివృద్ధి సంతృప్తినిచ్చిందన్న న్యాక్‌ పీర్‌ కమి టీ చైర్మన్‌ డాక్టర్‌ రాకేష్‌ గుప్తా, భవిష్యత్‌లో కళాశాల అభివృద్ధికి సలహాలు, సూచనలు అందిస్తూ, సంపూర్ణ తోడ్పాటునిస్తామన్నారు. న్యాక్‌ పరిశీలన కమిటీ ఆధ్వ ర్యంలో చేపట్టిన రెండు రోజుల పరిశీలన గురువారం ముగిసింది. ఈ సందర్భంగా నిర్వహించిన ఎగ్జిట్‌ మీటింగ్‌ మాట్లాడిన ప్రొఫెసర్‌ రాకేష్‌గుప్త, కళాశాల అభివృద్ధి కోసం పూర్వ విద్యార్థులు, అలుమినీ కమిటీ చేస్తున్న కృషిని ప్రశంసించారు. కమిటీ మెంటర్‌ కోఆర్డినేటర్‌ ప్రొఫెసర్‌ ధనుజిత్‌ సింధు మాట్లాడుతూ విద్యార్థుల్లో సోషల్‌ సైన్సెస్‌, సైకలాజికల్‌ సబ్జెక్టులపై మరింత పట్టు సాధించేలా చూడాలని, తద్వారా సునాయాసంగా ప్రభుత్వ ఉద్యోగాలను సాధించొచ్చ న్నారు. కమిటీ సభ్యుడు డాక్టర్‌ ధనుంజయ్‌ కల్వాంకర్‌ మాట్లాడుతూ ప్రతీ విభాగంలో విద్యార్థుల కోసం చేపడుతున్న సృజనాత్మక కార్యక్రమాలు సంతృప్తిని చ్చాయన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులే ఆవిష్క రణలను సృష్టించడంలో ముందుంటారని, ఆ దిశగా కృషి చేయాలన్నారు. అనంతరం  కమిటీ చైర్మన్‌ డాక్టర్‌ రాకేష్‌ గుప్త, కళాశాల ప్రిన్సిపాల్‌కు పరిశీలనకు సంబంధించిన ధ్రువపత్రం అందించారు. కార్యక్రమం లో వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ లవీన మంజులత, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. 


మహారాణి సేవలు చిరస్మరణీయం 

సంస్థాన వారసురాలిగా గద్వాలలో విద్యావ్యాప్తి కోసం మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ చేసిన సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి కొనియాడారు. మహారాణి వర్ధంతిని పురస్కరించుకుని గురువారం పట్టణంలోని ఎంఏఎల్‌డీ కళాశాలలో ప్రిన్సిపాల్‌, న్యాక్‌ పరిశీలన కమిటీ బృందం సభ్యులతో కలిసి మహారాణి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో న్యాక్‌ పీర్‌ కమిటీ చైర్మన్‌ డాక్టర్‌ ప్రకాష్‌గుప్తా,  కన్వీనర్‌ డాక్టర్‌ దమన్‌ జిత్‌ సింధు, సభ్యుడు డాక్టర్‌ ధనుంజయ్‌ తల్వాంన్‌ కర్‌,  ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ శ్రీపతినాయుడు, ప్రైవేటు కళాశాలల అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.భా స్కర్‌ రెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు బీఎస్‌ ఆనంద్‌, అలుమినీ కమిటీ సభ్యుడు అయ్యపురెడ్డి, కృష్ణయ్య, అప్సర్‌బాషా తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-19T05:22:36+05:30 IST