కంప్యూటర్‌ వార్మ్‌ వైరస్‌ కంటే డేంజర్‌!

ABN , First Publish Date - 2022-07-02T08:54:36+05:30 IST

పర్సనల్‌ కంప్యూటర్‌ లేదంటే సెల్‌ఫోన్‌కు వైరస్‌ సోకడం తెలిసిందే. అయితే వైరస్‌, వార్మ్‌(పురుగు) ఒక్కటి కాదు.

కంప్యూటర్‌ వార్మ్‌ వైరస్‌ కంటే డేంజర్‌!

పర్సనల్‌ కంప్యూటర్‌ లేదంటే సెల్‌ఫోన్‌కు వైరస్‌ సోకడం తెలిసిందే. అయితే వైరస్‌, వార్మ్‌(పురుగు) ఒక్కటి కాదు. రెండూ మాల్వేర్‌కు సంబంధించిన భిన్న రూపాలు మాత్రమే. వైరస్‌, ట్రోజాన్‌, వార్మ్స్‌, యాడ్‌వేర్‌, స్పైవేర్‌, రాన్సమ్‌వేర్‌ తదితరాలు ఉన్నాయి. మాల్వేర్‌ అనేది తప్పుడు సాఫ్ట్‌వేర్‌. ఇది ఏ సిస్టమ్‌పై వాలుతుందో అది దెబ్బతింటుంది. కంప్యూటర్‌ వైరస్‌ అనేది మాల్వేర్‌ సాధారణ రూపం. ఇది వ్యాప్తి చెందడానికి అతిధి ఉండాలి. అది పీసీ లేదంటే సెల్‌ కావచ్చు. లోపలికి చొచ్చుకువచ్చిన వైరస్‌ మొత్తం సిస్టమ్‌కు పాకుతుంది. కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌ లేదంటే ఆపరేటింగ్‌ సిస్టమ్‌లోకి తన కోడ్‌ను జొప్పించడం ద్వారా మొత్తం తతంగాన్ని పూర్తి చేస్తుంది. అయితే ఇది తనంతట తాను వర్క్‌ చేయదు. యూజర్‌ ఒక ఫైల్‌ను క్లిక్‌ చేసినప్పుడు అందులోకి అక్రమంగా చొచ్చుకువచ్చిన వైరస్‌ అక్కడి వ్యవస్థను తన గుప్పిట్లోకి తీసుకుని నష్టాన్ని కలుగజేస్తుంది. 


వార్మ్‌ విషయానికి వస్తే ఇది వైరస్‌కు మించినది. వైరస్‌కు కంటే వేగంగా వ్యాప్తి చెందుతుంది. కొన్ని సందర్భాల్లో ఒక డివైస్‌ నుంచి మరొక దానికి కూడా సోకుతుంది. ఉదాహరణకు ఈమెయిల్‌కు పట్టిన వార్మ్‌ ఇతర మెయిల్స్‌కు అక్కడి నుంచి కాంటాక్టుల్లోకి పాకుతుంది. వేగం కూడా వైరస్‌కు మించి ఉంటుంది. నెట్‌వర్క్‌లను ఆధారం చేసుకుని వార్మ్‌ మాదిరిగా వైరస్‌ పాకలేదు. వైరస్‌ అనేది హ్యూమన్‌ యాక్టివేషన్‌ ఆధారితం. వినియోగదారుడు క్లిక్‌ మనిపించకుంటే ఏమీ కాదు. వార్మ్‌ ఇందుకు విరుద్ధం. సిస్టమ్‌లోని ఫైల్స్‌కు ఆటోమేటిక్‌గా సోకుతుంది. 

Updated Date - 2022-07-02T08:54:36+05:30 IST