PG, ఎంఫిల్‌ తీసేస్తా ఎలా

ABN , First Publish Date - 2022-08-19T18:21:33+05:30 IST

అట్టడుగు వర్గాల పిల్లలకు ప్రభుత్వ విద్యను దూరం చేసే కుట్రలు చేస్తోందని ప్రొఫెసర్‌ హరగోపాల్‌(Professor Haragopal) తెలిపారు. రాష్ట్రంలోని యూనివర్సిటీలను పటిష్ఠం చేయాల్సిన అవసరముందని అన్నారు. తెలంగాణ జేఏసీ

PG, ఎంఫిల్‌ తీసేస్తా ఎలా

పేదలకు విద్యను దూరం చేసే కుట్ర

పీజీ, ఎంఫిల్‌ తీసేస్తా ఎలా: హరగోపాల్‌

ఓయూపై సర్కారు శీతకన్ను: కాశీం


హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): అట్టడుగు వర్గాల పిల్లలకు ప్రభుత్వ విద్యను దూరం చేసే కుట్రలు చేస్తోందని ప్రొఫెసర్‌ హరగోపాల్‌(Professor Haragopal) తెలిపారు. రాష్ట్రంలోని యూనివర్సిటీలను పటిష్ఠం చేయాల్సిన అవసరముందని అన్నారు. తెలంగాణ జేఏసీ ఆధ్వర్యం లో గురువారం ఉస్మానియా యూనివర్సిటీ ప్రధాన లైబ్రరీలో ‘సంక్షోభంలో తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయాలు’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఇటికాల పురుషోత్తం అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రొఫెసర్‌ హరగోపాల్‌ మాట్లాడారు. ‘‘75ఏళ్ల విద్యా విధానంలో అణగారిన పిల్లలు ఓయూ వరకు రాగలిగారు. రానున్న కాలంలో ఈ మాత్రం అవకాశముంటుందా..?’’ అని ప్రశ్నించారు. భవిష్యత్తులో నాలుగేళ్ల డిగ్రీ విధానాన్ని తీసుకొస్తున్నారని.. దాని తర్వాత ప్రవేశ పరీక్ష ద్వారా పీహెచ్‌డీ చేసే పద్ధతి తెస్తున్నారని తెలిపారు. ఉస్మానియా వర్సిటీ(Osmania University)లో పోస్టుల భర్తీకి ఏర్పాటు చేసే కామన్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఒక మాయ అని ఓయూ తెలుగు విభాగాధిపతి ప్రొఫెసర్‌ కాశీం అన్నారు.  ప్రభుత్వాలు జీడీపీలో విద్యకు 6 శాతం ఖర్చు చేయాలని 60 ఏళ్ల క్రితమే కొటారి కమిషన్‌ సూచిస్తే.. 75 ఏళ్లలో యేటా నాలుగు శాతం కూడా ఖర్చు చేయడం లేదని కాకతీయ యూనివర్సిటీ మాజీ వీసీ ఎన్‌.లింగమూర్తి తెలిపారు.  

Updated Date - 2022-08-19T18:21:33+05:30 IST