ఓటర్లకు సంపూర్ణ స్వేచ్ఛ కల్పించిన రాజ్యాంగం

ABN , First Publish Date - 2022-01-26T05:26:40+05:30 IST

భారత రాజ్యాంగం ఓటర్లకు సంపూర్ణ స్వేచ్ఛను కల్పించిందని నంద్యాల సబ్‌ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ అన్నారు.

ఓటర్లకు సంపూర్ణ స్వేచ్ఛ కల్పించిన రాజ్యాంగం
ప్రతిజ్ఞ చేస్తున్న సబ్‌ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌

  1. సబ్‌ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌


నంద్యాల టౌన్‌, జనవరి 25: భారత రాజ్యాంగం ఓటర్లకు సంపూర్ణ స్వేచ్ఛను కల్పించిందని నంద్యాల సబ్‌ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ అన్నారు. మంగళవారం సబ్‌ కలెక్టరేట్‌ కార్యాలయంలో 12వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునేలా ఓటర్లను చైతన్యపరచాలని అన్నారు. అభ్యర్థుల గుణగణాలు, గత చరిత్ర, విద్యార్హతలను పరిశీలించిన తరువాతే ఓటు వేయాలని సూచించారు. ప్రలోభాలకు లొంగి ఓటు వేస్తే 5ఏళ్ల పాలన వృథా అవుతుందని అన్నారు. నోటా ఓటు, టెండర్‌ ఓట్ల గురించి ఆమె వివరించారు. అనంతరం కార్యాలయ సిబ్బందిచేత ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఏవో హరినాథరావు, డీఎ్‌సవో ఆల్లీపీరా, డిప్యూటీ తహసీల్దార్‌ పక్కీర్‌ అహమ్మద్‌, మహమ్మద్‌ రఫీ పాల్గొన్నారు. 


పాణ్యం: దేశాభివృద్ధికి సరైన ఓటే కీలకమని విశ్రాంత తెలుగు పండితుడు నాగలక్ష్మయ్య అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఓటరు దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మనం ఓటు వేసే సమయంలో తీసుకున్న నిర్ణయాన్ని బట్టే మన అభివృద్ధి ఉంటుందన్నారు. అనంతరం ఉత్తమ సేవలందించిన బీఎల్‌వోలను, ముఖ్య అతిఽథులను తహసీల్దార్‌ శివప్రసాదరెడ్డి సన్మానించారు. కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయుడు ఓబులరెడ్డి, ఎంఈవో కోటయ్య, ఆర్‌ఐ శేషాద్రి, ఏఎ్‌సఓ ప్రహ్లాద పాల్గొన్నారు.  


గోస్పాడు: పౌరునికి ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని తహసీల్దార్‌ మంజుల అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా మంగళవారం తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణలో ప్రతిజ్ఞ చేశారు. తహసీల్దార్‌ మంజుల మాట్లాడుతూ 18 సంవత్సరాలు పూర్తయిన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సర్వేయర్‌ వెంకటరమణ, ఆర్‌ఐ రామేశ్వరమ్మ, హెడ్‌ కానిస్టేబుల్‌ సంజీవరాయుడు, షబ్బీర్‌ హుసేన్‌ పాల్గొన్నారు. 


శిరివెళ్ల: ఓటు ప్రజాస్వామ్యానికి మూలస్తంభమని యర్రగుంట్ల గంగుల తిమ్మారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ రామకృష్ణారెడ్డి అన్నారు. కళాశాలలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని మంగళవారం నిర్వహించారు. అనంతరం అధ్యాపకులు, విద్యార్థులచే ఆయన ఓటరు ప్రతిజ్ఙ చేయించారు. కార్యక్రమంలో డైస్‌ ప్రిన్సిపాల్‌ శ్రీనివాసరెడ్డి, అధ్యాపకులు జనార్ధన్‌, పుల్లారెడ్డి, పున్నారావు, శ్రీనివాసరావు పాల్గొన్నారు. 


దొర్నిపాడు: 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలని తహసీల్దార్‌ జయప్రసాదు అన్నారు. మంగళవారం ఓటరు దినోత్సవం సందర్భంగా తహసీల్దార్‌ కార్యాలయంలో ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఆర్‌ఐ సాంబశివుడు, వీఆర్వోలు పాల్గొన్నారు. 


రుద్రవరం: ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని తహసీల్దార్‌ వెంకటశివ అన్నారు. మంగళవారం జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా తహసీల్దార్‌ కార్యాలయంలో గ్రామ రెవెన్యూ అధికారులు, అధికారులతో ఓటు హక్కుపై ప్రతిజ్ఞ చేయించారు. 


గడివేముల: ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధమని డిప్యూటీ తహసీల్దార్‌ సుభాకర్‌ అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా మండల రెవెన్యూ కార్యాలయంలో సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు ఓటరుగా నమోదు చేసుకోవాలని అన్నారు.



Updated Date - 2022-01-26T05:26:40+05:30 IST