రైల్వే గడ్డర్‌ను ఢీకొన్న కంటైనర్‌ లారీ

Published: Thu, 07 Jul 2022 01:01:09 ISTfb-iconwhatsapp-icontwitter-icon
రైల్వే గడ్డర్‌ను ఢీకొన్న కంటైనర్‌ లారీకంటైనర్‌ లారీ ఢీకొనడంతో నేలకొరిగిన గడ్డర్‌

కుప్పకూలిన భారీ ఇనుప పరికరం

త్రుటిలో తప్పిన ప్రాణాపాయం

అనకాపల్లిటౌన్‌, జూలై 6: విజయరామరాజుపేట రైల్వే అండర్‌బ్రిడ్జి వద్ద బుధవారం సాయంత్రం త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. మాడుగుల నుంచి అనకాపల్లి వస్తున్న కంటైనర్‌ లారీ అండర్‌బ్రిడ్జి వద్ద గడ్డర్‌ను బలంగా ఢీకొంది. దీంతో గడ్డర్‌ మొత్తం  నేలకొరిగింది. అయితే ఈ సమయంలో ఎవరూ రాకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఈ సంఘటన కారణంగా కొద్దిసేపు ట్రాఫిక్‌ స్తంభించింది. ట్రాఫిక్‌ పోలీసులు వాహనాలను లక్ష్మీదేవిపేట రైల్వేగేటు మీదుగా మళ్లించారు. క్రేన్‌ను రప్పించి గడ్డర్‌ను పక్కకు తొలగించారు.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.