జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ

ABN , First Publish Date - 2022-06-22T23:23:56+05:30 IST

అమరావతి: టీడీపీ పోలిట్‌ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు ఇంటి గోడ కూల్చివేత కేసులో ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తిరిగి గోడ కట్టుకునేందుకు హైకోర్టు అనుమతి

జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ

అమరావతి: టీడీపీ పోలిట్‌ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు ఇంటి గోడ కూల్చివేత కేసులో ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తిరిగి గోడ కట్టుకునేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. అక్రమంగా గోడ కూల్చి వేయడంతో పిటీషన్‌ వేయాలని హైకోర్టు అయ్యన్న తరపు న్యాయవాదులను ఆదేశించింది. దీనిపై తగిన ఆదేశాలు ఇస్తామని స్పష్టం చేసింది.


  నర్సీపట్నం పురపాలక సంఘం, జలవనరుల శాఖ అనుమతి ఇచ్చినా.. గోడ కూల్చివేశారని అయ్యన్నపాత్రుడి తరుపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. అర్ధరాత్రి సమయంలో గోడ కూల్చి వేశారని ఆధారాలు చూపారు. కాగా జాయింట్‌ సర్వేకు అయ్యన్న కుమారులు దరఖాస్తు చేశారని  ప్రభుత్వ న్యాయవాదులు చెప్పారు. ప్రభుత్వం తరుపు న్యాయవాది, అయ్యన్న పాత్రుడి న్యాయవాది వాదనలు అనంతరం గోడ నిర్మించుకునేందుకు  హైకోర్టు అనుమతి ఇచ్చింది. 

     అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి ఇంటి గోడను ఇటీవల  కూల్చివేశారు. నీటిపారుదల శాఖకు చెందిన స్థలం ఆక్రమించారనే ఆరోపణలతో మున్సిపల్‌ అధికారులు పడగొట్టారు. ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా గోడ కూల్చేయడంతో కుటుంబసభ్యులు, తెదేపా కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై  అయ్యన్నపాత్రుడి కుమారులు హై కోర్టును ఆశ్రయించారు.  

Updated Date - 2022-06-22T23:23:56+05:30 IST