కర్ఫ్యూలో కారును ఆపారని... కానిస్టేబుళ్లను హెచ్చరించిన పోలీస్ బాస్ కుమార్తె!

ABN , First Publish Date - 2021-04-19T11:51:24+05:30 IST

దేశవ్యాప్తంగా కరోనా అత్యంత వేగంగా విస్తరిస్తోంది. ఈ నేపధ్యంలో...

కర్ఫ్యూలో కారును ఆపారని... కానిస్టేబుళ్లను హెచ్చరించిన పోలీస్ బాస్ కుమార్తె!

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా అత్యంత వేగంగా విస్తరిస్తోంది. ఈ నేపధ్యంలో పలు రాష్ట్రాలు కరోనా కట్టడి చర్యలు చేపడుతున్నాయి. అయితే ఈ ఆంక్షలపై పలుచోట్ల ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దేశరాజధాని ఢిల్లీలో ఒక జంట కారుతో వెళుతుండగా, వారి కారును పోలీసులు ఆపారు. వెంటనే కారులో నుంచి దిగిన మహిళ ఆ పోలీసులకు వార్నింగ్ ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 


వివరాల్లోకి వెళితే ప్రస్తుతం ఢిల్లీలో వీకెండ్ లాక్‌డౌన్ అమలవుతోంది. ఈ నేపధ్యంలో దరియాగంజ్‌లో మాస్క్ పెట్టుకోకుండా కారులో ప్రయాణిస్తున్న ఒక జంటను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కారులో ఉన్న మహిళ వెంటనే కిందకు దిగి, రోడ్డుపై నానా హంగామా చేసింది... ‘మా నాన్న కూడా పోలీసే.. ఆయన ఒక ఎస్ఐ.... వచ్చారండీ... మాస్క్ పేరుతో చలానాలు వసూలు చేయడానికి...’ అంటూ ఆగ్రహంతో ఊగిపోయంది. అంతటితో ఆగకోకుండా... ‘నేనేమైనా చేస్తాను... ఆపగలిగితే ఆపండి‘ అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగింది. కాగా ఆ జంట దగ్గర కర్ప్యూ పాస్ లేదని పోలీసులు గుర్తించారు. ఆ జంటను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిని పంకజ్ దత్తా, అభా యాదవ్‌గా గుర్తించి, కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. 

                                         ‘గోవింద్ పాండే’ సౌజన్యంతో...

Updated Date - 2021-04-19T11:51:24+05:30 IST