డిసెంబర్ 31న పూటుగా మద్యం తాగిన మహిళా ఫారెస్ట్ గార్డ్.. ఆ తర్వాత బ్యాంకుకెళ్లి ఏం చేసిందంటే..

ABN , First Publish Date - 2022-01-02T20:55:22+05:30 IST

డిసెంబర్ 31న ఆ మహిళా ఫారెస్ట్ గార్డు పూటుగా మద్యం సేవించింది. ఎంతలా అంటే.. మరుసటి రోజు మద్యాహ్నం సమయానికి కూడా ఆమెకు ఆ మత్తు వదల్లేదు. మత్తులోనే తూగుతూ.. బ్యాంకుకు వెళ్లింది. అక్కడ బ్యాం

డిసెంబర్ 31న పూటుగా మద్యం తాగిన మహిళా ఫారెస్ట్ గార్డ్.. ఆ తర్వాత బ్యాంకుకెళ్లి ఏం చేసిందంటే..

ఇంటర్నెట్ డెస్క్: డిసెంబర్ 31న ఆ మహిళా ఫారెస్ట్ గార్డు పూటుగా మద్యం సేవించింది. ఎంతలా అంటే.. మరుసటి రోజు మద్యాహ్నం సమయానికి కూడా ఆమెకు ఆ మత్తు వదల్లేదు. మత్తులోనే తూగుతూ.. బ్యాంకుకు వెళ్లింది. అక్కడ బ్యాంక్ పాస్‌బుక్ ఇచ్చి, డబ్బులు కావాలని.. ఆ అకౌంట్ నుంచి విత్‌డ్రా చేసి ఇవ్వాలని క్యాషియర్‌ను కోరింది. అకౌంట్‌లో బ్యాలెన్స్ చెక్ చేసిన క్యాషియర్.. అందులో డబ్బులు లేవని చెప్పాడు. అంతే.. అకౌంట్లో డబ్బులు లేవనే మాటలు విని ఆమె ఆగ్రహంతో ఊగిపోయింది. ఆ తర్వాత ఆమె ఏం చేసిందనే పూర్తి వివరాల్లోకి వెళితే..


మధ్యప్రదేశ్‌కు చెందిన ఫ్రాన్సిస్.. గత కొంతకాలంగా ఖాండ్వా రేంజ్‌లో ఫారెస్ట్ గార్డుగా ఉద్యోగం చేస్తోంది. డిసెంబర్ 31న రాత్రి ఈమె పూటుగా మద్యం సేవించింది. మరుసటి రోజు మధ్యాహ్నం వరకూ ఆమెకు ఆ మత్తు దిగలేదు. అయినప్పటికీ తూలుతూనే స్థానికంగా ఉన్న బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ వద్దకు చేరుకుంది. తనతోపాటు తీసుకొచ్చిన పాస్‌బుక్‌ను.. బ్యాంకులోని క్యాషియర్‌కు ఇచ్చి, నగదు కావాలని అడిగింది. దీంతో క్యాషియర్ అకౌంట్‌ను చెక్ చేసి.. అందులో డబ్బులు లేవని ఆమెకు చెప్పాడు. దీంతో ఫ్రాన్సిస్ ఆగ్రహంతో ఊగిపోయింది. 



బ్యాంకు సిబ్బందిని బండ బూతులు తిడుతూ.. అక్కడే కూర్చుని ఏడుస్తూ రచ్చరచ్చ చేసింది. విషయం తెలుసుకుని అక్కడకు చేరుకున్న మీడియా ప్రతినిధులపై కూడా ఆమె నోరు పారేసుకుంది. ఆమె ప్రవర్తనతో విసిగిపోయిన బ్యాంక్ మేనేజర్ పోలీసులకు సామాచారం ఇచ్చాడు. దీంతో ఇద్దరు మహిళా పోలీసు అధికారులు ఆమెను మొదటగా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి, సాయంత్రం విడుదల చేశారు. కాగా.. వారానికి రెండు మూడుసార్లు తమ బ్యాంకుకు వస్తుందని సదరు బ్యాంకు మేనేజర్ పేర్కొన్నాడు. తన తల్లిదండ్రులకు వచ్చే పెన్షన్‌ను తీసుకెళ్లడానికి వచ్చిన ప్రతిసారి ఇలానే మత్తులోనే ఉంటుందని ఆయన చెప్పారు. 




Updated Date - 2022-01-02T20:55:22+05:30 IST