ఇంటికి దూరంగా ఉంటూ జాబ్ చేస్తున్న యువకుడు.. TCSలో చేరబోతున్నట్టు ఫోన్‌లో చెప్పి.. రాత్రికి రాత్రే..

ABN , First Publish Date - 2021-12-24T02:57:01+05:30 IST

అతడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. 8 నెలలుగా ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడికి ప్రముఖ కంపెనీ జాబ్ ఆఫర్ చేసింది. భారీ ప్యాకేజ్ ప్రకటించింది. దీంతో ఎగిరి గంతేశాడు. ఆ రోజు రాత్రి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి టీసీఎస్‌లో చేరబోతు

ఇంటికి దూరంగా ఉంటూ జాబ్ చేస్తున్న యువకుడు.. TCSలో చేరబోతున్నట్టు ఫోన్‌లో చెప్పి.. రాత్రికి రాత్రే..

ఇంటర్నెట్ డెస్క్: అతడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. 8 నెలలుగా ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడికి ప్రముఖ కంపెనీ జాబ్ ఆఫర్ చేసింది. భారీ ప్యాకేజ్ ప్రకటించింది. దీంతో ఎగిరి గంతేశాడు. ఆ రోజు రాత్రి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి టీసీఎస్‌లో చేరబోతున్నట్టు చెప్పి, ఆనందాన్ని వ్యక్తం చేశాడు. అయితే రాత్రికి రాత్రే.. అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. దీంతో అతడు చేసిన పనికి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాకయ్యారు. ఇంతకూ ఏం జరిగిందంటే..



మధ్యప్రదేశ్‌కు చెందిన సత్యం రఘువంశీ.. గత ఎనిమిది నెలలుగా ఇండోర్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడికి ప్రముఖ కంపెనీ అయిన టీసీఎస్‌లో జాబ్ వొచ్చింది. దీంతో ఎగిరి గంతేశాడు. బుధవారం రోజు రాత్రి.. కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తన ఆనందాన్ని వారితో పంచుకున్నాడు. సీనియర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా టీసీఎస్‌లో చేరబోతున్నట్టు తెలిపి సంతోషం వ్యక్తం చేశాడు. దీంతో అతడి కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆనందించారు. కానీ.. రాత్రి రాత్రే సత్యం తీసుకున్న అనూహ్య నిర్ణయం వల్ల వారి సంతోషం 24 గంటలు గడవకముందే ఆవిరైంది. సత్యం ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుసుకుని.. అతడి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా.. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అంతేకాకుండా సత్యం రూమ్‌ను పరిశీలించి.. సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే అందులో ‘సారీ.. గాడ్ బ్లెస్ యూ’ అనే పదాలు ఉండటంతో సత్యం మృతికి గల కారణాలు తెలియరాలేదు.  



Updated Date - 2021-12-24T02:57:01+05:30 IST