పోలీసుల సీక్రెట్ ఆపరేషన్‌లో ప్రెగ్నెంట్ బాలిక మృతి.. బాధిత కుటుంబానికి రూ.164 కోట్లకు పైగా పరిహారం..

ABN , First Publish Date - 2022-06-28T03:07:17+05:30 IST

పోలీసుల సీక్రెట్ ఆపరేషన్‌లో(Covert operation) ప్రమాదవశాత్తూ కడుపుతో ఉన్న బాలిక మరణించడంతో కాలిఫోర్నియా(California) న్యాయస్థానం బాధిత కుటుంబానికి తాజాగా 21 మిలియన్ డాలర్ల(సుమారు రూ.164 కోట్లు) పరిహారం ప్రకటించింది.

పోలీసుల సీక్రెట్ ఆపరేషన్‌లో ప్రెగ్నెంట్ బాలిక మృతి.. బాధిత కుటుంబానికి రూ.164 కోట్లకు పైగా పరిహారం..

ఎన్నారై డెస్క్: పోలీసుల సీక్రెట్ ఆపరేషన్‌లో(Covert operation) ప్రమాదవశాత్తూ కడుపుతో ఉన్న టీనేజర్ మరణించడంతో కాలిఫోర్నియా(California) న్యాయస్థానం బాధిత కుటుంబానికి తాజాగా 21 మిలియన్ డాలర్ల(సుమారు రూ.164 కోట్లు) పరిహారం ప్రకటించింది. 2018లో ఈ దారుణం జరగ్గా బాధిత కుటుంబం కోర్టును ఆశ్రయించడంతో వారికి ఊరట దక్కింది. బాధితుల కథనం ప్రకారం.. ఓ కేసులో నిందితుడిగా ఉన్న రికో టైగర్‌ను(Rico tiger) పట్టుకునేందుకు ఫ్రీమోంట్(Fremont) పోలీసులు ఓ సీక్రెట్ ఆపరేషన్ ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా వారు ఓ రోజు రీకో నడుపుతున్న టాక్సీని అడ్డగించారు. ఆ సమయంలో.. 16 ఏళ్ల బాలిక ఎలీనా మోండ్రాగన్(Elena mondragon) కారులో ప్రయాణిస్తోంది. అప్పటికి ఆమె మూడు నెలల గర్భవతి. 


కాగా.. పోలీసులను చూసిన వెంటనే రికో కారులోంచి దిగి పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో మఫ్టీలో ఉన్న ఓ పోలీసు ఆఫీసర్ ఆటోమేటిక్ తుపాకీతో(AR-15) అతడి వైపు కాల్పులు జరిపాడు. దురదృష్టవశాత్తూ.. కారులోని ఎలీనాకు తూటాలు తగలడంతో ఆమె మృతి చెందింది. అయితే.. ఈ కాల్పులకు పరోక్షంగా కారణమైన టైగర్‌పై పోలీసులు ప్రొవొకేషన్ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇటువంటి సందర్భాల్లో పోలీసులు బాధిత కుటుంబానికీ ఎంతోకొంత పరిహారాన్ని చెల్లిస్తుంటారు. కానీ ఈ ఘటనలో బాధిత కుటుంబానికీ న్యాయం చేయకుండా నిర్లక్ష్యం చేశారు. దీంతో వారు కోర్టును ఆశ్రయించారు. బాలిక అనామకురాలని, ఆమెది సామాన్య నేపథ్యమనే ధీమాతో పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శించారంటూ బాధితుల తరుపు న్యాయవాది కోర్టులో వాదించారు. కాగా..  ఈ కేసులో రెండేళ్ల పాటు విచారణ జరగ్గా ఇటీవలే బాధితులకు అనుకూలంగా తీర్పు వెలువడింది. 21 మిలియన్ డాలర్ల పరిహారాన్ని పోలీసు శాఖ, స్థానిక ప్రభుత్వం, నిందితుడు రికో టైగర్ చెల్లించాలని న్యాయస్థానం తీర్పు వెలువరించింది.

Updated Date - 2022-06-28T03:07:17+05:30 IST