అరకొరగా విద్యాకానుక కిట్లు

ABN , First Publish Date - 2022-07-06T05:27:41+05:30 IST

పాఠశాలలు మంగళవారం పునఃప్రారంభమయ్యాయి. విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కిట్లు పంపిణీ చేయాలని ఇటు విద్యాశాఖ అధికా రులు, అటు ప్రజాప్రతినిధులు ఆర్భాటంగా విద్యార్థుల తల్లిదండ్రులతో పాఠశాలల్లో సమావేశాలను ఏర్పాటు చేశారు.

అరకొరగా విద్యాకానుక కిట్లు
పెంట గ్రామంలో విద్యా కానుక కిట్ల కోసం ఎదురుచూస్తున్న తల్లిదండ్రులు, విద్యార్థులు


  మొక్కుబడిగా పంపిణీ

  ఉసూరుమంటూ వెనుదిరిగిన విద్యార్థుల తల్లిదండ్రులు

జి.సిగడాం, జూలై 5: పాఠశాలలు మంగళవారం పునఃప్రారంభమయ్యాయి. విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కిట్లు పంపిణీ చేయాలని ఇటు విద్యాశాఖ అధికా రులు, అటు ప్రజాప్రతినిధులు ఆర్భాటంగా విద్యార్థుల తల్లిదండ్రులతో పాఠశాలల్లో సమావేశాలను ఏర్పాటు చేశారు. తీరా విద్యార్థులకు సరిపడ పాఠ్య పుస్తకాలు, నోట్‌ బుక్‌లు, బెల్ట్‌లు, షూస్‌, ఏకరూప దుస్తులు రాకపోవ డంతో మొక్కుబడిగా పంపిణీ చేశారు. పెంట గ్రామంలో ముందుగా మైక్‌ల ద్వారా ఉపాధ్యాయులు, ప్రజాప్రతిని ధులు ఆర్భాటంగా ప్రచారం చేసి విద్యార్థుల తల్లిదండ్రులను మంగళవారం ఆగమే ఘాలమీద గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలకు రప్పించారు. తీరా చూస్తే విద్యార్థులకు సరిపడ కిట్‌లు రాకపోవడంతో తల్లిదండ్రులు మమ్మల్ని ఎందుకు రమ్మ న్నారంటూ నిర్వాహకులపై మండిపడ్డారు. ప్రభుత్వ ప్రచారాలకు మమ్మల్ని వాడు కుంటారా అంటూ ఆవేదనతో వెనుదిరిగారు. ఒకరిద్దరు విద్యార్థులకు అరకొర కిట్లను ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. ఇదే మాదిరిగా మండ లంలో మొత్తం 63 పాఠశా లల్లో విద్యాకానుక కిట్ల పంపిణీ మొక్కుబడిగా సాగింది. మండలంలో 63 పాఠశా లల్లో 5,694 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. మొదట విడతగా 20,415, రెండో విడతగా 13,390 పుస్తకాలు వచ్చాయి. ఆరోతరగతి నుంచి పదో తరగతి వర కూ నోట్‌ బుక్స్‌, డిక్సనరీలు, బెల్ట్‌లు వచ్చాయి. ఏకరూప దుస్తులు, బ్యాగ్‌లు, షూస్‌ మాత్రం సరిపడా రాలేదు. ఎనిమిదో తరగతి పాఠ్యపుస్తకాలు పూర్తిగా రాలేదు.

 


 



Updated Date - 2022-07-06T05:27:41+05:30 IST