ట్రైనీ కలెక్టర్లకు క్షేత్రస్థాయి పర్యటన ఎంతగానో ఉపయోగపడుతుంది

ABN , First Publish Date - 2022-09-26T04:09:38+05:30 IST

జిల్లాపాలనలో ప్రము ఖపాత్ర పోషించే ఐఏఎస్‌ అధికారులకు శిక్షణలో భాగంగా తలపెట్టిన క్షేత్రస్థాయి పర్యటన ఎంతగానో ఉపయోగపడుతుందని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు.

ట్రైనీ కలెక్టర్లకు క్షేత్రస్థాయి పర్యటన ఎంతగానో ఉపయోగపడుతుంది
ట్రైనీ ఐఏఎస్‌ల సమావేశం మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌

- కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

ఆసిఫాబాద్‌, సెప్టెంబరు 25: జిల్లాపాలనలో ప్రము ఖపాత్ర పోషించే ఐఏఎస్‌ అధికారులకు శిక్షణలో భాగంగా తలపెట్టిన క్షేత్రస్థాయి పర్యటన ఎంతగానో ఉపయోగపడుతుందని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. తమశిక్షణలో భాగంగా జిల్లాకేంద్రానికి వచ్చిన ఆరు గురు శిక్షణ ఐఏఎస్‌ అధికారులకు అదనపు కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయితో కలిసి పది విభాగాల జిల్లా అధికారులతో కలెక్టర్‌క్యాంపు కార్యాలయంలో పని తీరుపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలనలో తమ దైన ముద్ర చూపించాలంటే తప్పనిసరిగా శిక్షణలో ఐఏఎస్‌ అధికారులు అనేకఅంశాలు నేర్చుకోవాల్సి ఉంటుందన్నారు. కుమరం భీం జిల్లా లాంటి జిల్లాల్లో ఎన్నో కొత్తఅంశాలు తెలుస్తాయన్నారు. ప్రజల అవ సరాలు, చేయాల్సిన పనులు కళ్లకు కట్టినట్లు కనిపి స్తాయన్నారు. ఈ సందర్భంగా ట్రైనీ ఐఏఎస్‌ అధికా రులు అడిగిన పలుప్రశ్నలకు జిల్లా అధికా రులు సమాధానాలు ఇచ్చారు.

బాలరక్ష భవన్‌ను సందర్శించిన ట్రైనీ ఐఏఎస్‌లు

జిల్లా కేంద్రంలోని బాలరక్ష భవన్‌ని ఆది వారం శిక్షణ ఐఏఎస్‌ల బృందం సందర్శించిం ది. ఈ సందర్భంగా బాలల సంరక్షణకు తీసు కుంటున్న చర్యలు, కార్యక్రమాలని జిల్లా బాలల సంరక్షణాధికారి మహేష్‌ వివరించారు. అనంతరం వారు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు.

తేనెశుద్ధి కేంద్రం సందర్శన

వాంకిడి: మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన తేనె శుద్ధి కేంద్రం, సీఎఫ్‌సీని ఆదివారం జిల్లా ట్రైనీకలెక్టర్‌ బృందం సందర్శించింది. తేనెశుద్ధి జరిగే విధానం, ప్రస్తుతం నిల్వ ఉన్న తేనె వివరాలను ఐకేపీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండల కేంద్రంలోని సీఎఫ్‌సీని సందర్శించారు.

Updated Date - 2022-09-26T04:09:38+05:30 IST