AP News: రాజమండ్రిలోని ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో మంటలు

ABN , First Publish Date - 2022-08-29T16:02:35+05:30 IST

రాజమండ్రి కుమార్ టాకీస్ గోదావరి గట్టుపై ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

AP News: రాజమండ్రిలోని ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో మంటలు

రాజమండ్రి: రాజమండ్రి (Rajahmundry) కుమార్ టాకీస్ గోదావరి గట్టుపై ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కాగా షాపింగ్ కాంప్లెక్స్‌పైన ఇళ్లలో ఉన్న వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని ఇంట్లోని ఉన్నవారిని క్షేమంగా బయటకు తీసుకువచ్చారు. అలాగే మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నప్పటికీ ఇంకా అదుపులోకి రాని పరిస్థితి. మరోవైపు వృద్ధులు ఇంకా ఇంట్లో ఉండిపోయారు. అలాగే విలువైన సామాగ్రి ఇళ్లలో ఉండటంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు మంటలు... మరోవైపు మిద్ది మీదే ఉండిపోయిన వారి కోసం మిగిలిన కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 


Updated Date - 2022-08-29T16:02:35+05:30 IST