నీట చిక్కిన పల్లె

ABN , First Publish Date - 2022-10-08T05:50:15+05:30 IST

నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నగర శివారు ప్రాంతాలు, రూరల్‌లోని రెండు పంచాయతీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

నీట చిక్కిన పల్లె
రుద్రంపేట పంచాయతీలో మడుగులా రహదారులు

జలదిగ్బంధంలో కొడిమి.. రుద్రంపేట


నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నగర శివారు ప్రాంతాలు, రూరల్‌లోని రెండు పంచాయతీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆలమూరు చెరువు మరవ పారుతుండటంతో రుద్రంపేట పంచాయతీలోని విశ్వశాంతి, దివ్యాంగుల కాలనీలలోకి నీరు చేరింది. కొడిమి వంక ప్రవాహ ఉధృతి కారణంగా రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోవడంతో వంకను దాటుతూ ప్రమాదాలకు గురవుతున్నారు. విద్యార్థులు, మహిళలు, వృద్ధులు పట్టుదప్పి వంకలో పడిపోతున్నారు. వంకను దాటేందుకు ద్విచక్ర వాహనదారులు ఫీట్లు చేయాల్సి వస్తోంది. మరోవైపు వంక నీటిలో చిన్నారులు ఈదుతూ, చేపలు పడుతూ సరదాగా గడుపుతున్నారు. 

- అనంతపురం రూరల్‌


25 మండలాల్లో వర్షం 

అనంతపురం అర్బన, అక్టోబరు 7: జిల్లాలోని 25 మండలాల్లో గురువారం రాత్రి వర్షం  పడింది. అత్యధికంగా విడపనకల్లులో 57.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. శెట్టూరు 35.2, ఉరవకొండ 30.4, కంబదూరు 26.2, కళ్యాణదుర్గం 24.2, కుందుర్పి 18.2,  ఆత్మకూరు 17.6, యల్లనూరు 14.8, బెళుగుప్ప 14.0, యాడికి 13.0, పామిడి 12.6, వజ్రకరూరు 11.6, బ్రహ్మసముద్రం మండలంలో 10 మి.మీ. వర్షపాతంనమోదైంది. మిగతా ప్రాంతాల్లో 7 మి.మీ. వరకూ వర్షపాతం నమోదైంది. 








Updated Date - 2022-10-08T05:50:15+05:30 IST