నకిలీ నోట్ల కలకలం

ABN , First Publish Date - 2021-07-24T07:09:18+05:30 IST

బాన్సువాడలో నకిలీ నోట్ల వార్త కలకలం రేపింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ వ్యక్తితో బాన్సు వాడకు చెందిన ఓ యువకుడికి సంబంధాలు ఉండడంతో నకిలీ నోట్ల చలామణి బయట పడింది.

నకిలీ నోట్ల కలకలం



చలామణి చేసిన బాన్సువాడ యువకుడు
ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వ్యక్తితో సంబంధాలు
మధ్య ప్రదేశ్‌ పోలీసులకు చిక్కిన ముఠా
కాల్‌ లిస్టు ఆధారంగా యువకుడి నెంబరు లభ్యం
గురువారం అర్ధరాత్రి యువకుడిని అదుపులోకి   తీసుకున్న మధ్య ప్రదేశ్‌ పోలీసులు

బాన్సువాడ, జూలై 24 : బాన్సువాడలో నకిలీ నోట్ల వార్త కలకలం రేపింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ వ్యక్తితో బాన్సు వాడకు చెందిన ఓ యువకుడికి సంబంధాలు ఉండడంతో నకిలీ నోట్ల చలామణి బయట పడింది. దీంతో ఆ యువకుడిని మధ్య ప్రదేశ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే... బాన్సువాడ పట్టణంలోని మదీనా కాలనీకి చెందిన అబ్దుల్‌ అద్నాన్‌ అనే యువకుడు యూ ట్యూ బ్‌లో దొంగనోట్లు ఎలా ముద్రించాలో అనే వీడియో చూసి ఛత్తీస్‌గఢ్‌కు చెందిన నరేష్‌ పవార్‌ను సంప్రదించాడు. వీరి ఒప్పందం మేరకు సుమారు రూ.లక్ష చెల్లించి రూ.8 లక్షల వరకు నకిలీ నోట్లు మధ్యప్రదేశ్‌ నుంచి బాన్సువాడకు తీసుకు వచ్చాడు. అయితే, మధ్యప్రదేశ్‌ పోలీసులకు ఛత్తీస్‌గఢ్‌కు చెం దిన నరేష్‌ పవార్‌ ముఠా నకిలీ నోట్ల చలామణిలో దొరకడంతో వారిని మధ్యప్రదేశ్‌ పోలీసులు అరెస్టు చేసి విచారణ చేపట్టారు. అతడు వెల్లడించిన సమాచారంతో మధ్యప్రదేశ్‌లోని రాయ్‌ఘడ్‌ జిల్లా జీరాపూర్‌ ఎస్సై మంగళ్‌ సింగ్‌ రాథోడ్‌, పోలీసులు గురువారం అర్ధరాత్రి నరేష్‌ పవార్‌తో కలిసి బాన్సు వాడకు చేరుకున్నారు. సదరు యువకుడు పరారీలో ఉం డడంతో అతడి తండ్రి, కుటుంబ సభ్యులను అదుపులోకి తీసు కుని విచారణ చేపట్టారు. చివరకు యువకుడు అద్నాన్‌ బాన్సు వాడకు చేరుకోవడంతో అదుపులోకి తీసుకున్నారు.
రూ.8 లక్షల వరకు నకిలీ నోట్ల చలామణి
బాన్సువాడలో సుమారు రూ.8 లక్షల వరకు నకిలీ నోట్లు చలామణి అయినట్లు మధ్యప్రదేశ్‌ పోలీసులు తెలిపిన స మాచారం. దీంతో కాల్‌ లిస్టు ఆధారంగా బాన్సువాడ యువకుణ్ణి అదుపు లోకి తీసుకున్న మధ్య ప్రదేశ్‌ పోలీసులు విచారణ నిమిత్తం మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు తరలించినట్లు సమాచారం. బాన్సువాడ యువకున్ని విచారణ చేపడితే బాన్సువాడకు చెందిన మరికొంత మంది యువకుల పేర్లు బయట పడనున్నట్లు తెలుస్తోంది. ఈ యువకుడితో పాటు మరికొంత మంది పాత్ర ఉన్నట్లు మధ్య ప్రదేశ్‌ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఆ యువకుడు మధ్యప్రదేశ్‌ పోలీ సులు వస్తున్నారనే సమాచారంతో గత రాత్రే నకిలీ నోట్లను కాల్చినట్లు కూడా మరికొంత మంది యువకులు పేర్కొనడం గమనార్హం. ఇదిలా ఉంటే ఆ యువకుడి కోసం కాల్‌ లిస్టు ద్వారా బాన్సువాడకు మధ్య ప్రదేశ్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని రావడంతో ముందస్తు సమాచారంతోనే పరారైనట్లు మధ్యప్రదేశ్‌ పోలీసులు పేర్కొన్నట్లు తెలుస్తుంది.
మరికొంత మంది యువకులకు సంబంధాలు..
జిల్లాలో నకిలీనోట్లను చలామణి చేసిన అబ్దుల్‌ అద్నాన్‌తో బాన్సువాడలోని మరికొంత మంది యువకులు సంబంధాలు న్నట్లు మధ్యప్రదేశ్‌ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లో నకిలీ నోట్ల తయారీకి కూడా బాన్సువాడ యు వకుడు ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు మధ్యప్రదేశ్‌ పోలీసుల ద్వారా తెలిసిన సమాచా రం. బాన్సువాడ యువకున్ని గురు వారం అర్ధరాత్రి భోపాల్‌కు తరలిం చారు. విచారణ నిమిత్తం మరికొన్ని ఆసక్తి గల విషయాలు బయటకు రానున్నట్లు తెలుస్తోంది. ఈ విషయ మై బాన్సువాడ పట్టణ సీఐ రామ కృష్ణారెడ్డిని ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా, మధ్యప్రదేశ్‌ నుంచి పోలీ సులు వచ్చిన మాట వాస్తవమేనని, బాన్సువాడకు చెందిన అద్నాన్‌ అనే యువకున్ని అదుపులోకి తీసుకుని మధ్యప్రదేశ్‌కు తరలించారని, పూర్తి వివరాలు వెల్లడిస్తామని మధ్యప్రదేశ్‌ పోలీసులు తెలుపుతారని సీఐ తెలిపారు.
దుమారం రేపుతున్న నోట్ల చలమణి
బాన్సువాడ డివిజన్‌ పక్కనే ఉన్న బోధన్‌లో నకిలీ పాస్‌పోర్టుల కుంభకోణంలో బోధన్‌కు చెందిన కొంతమందిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ సంఘటన మరువక ముందే బాన్సువాడలో నకిలీ నోట్ల కలకలం దుమారం రేపడంతో నకిలీ దందా ఏ విధంగా కొనసాగుతుందో.. పోలీసుల నిఘా ఎంత ఉందోనని ప్రజలు చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా గుట్కా, మట్కా, ఉమ్మడి జిల్లాలో విచ్చల విడిగా జరుగుతున్నా పోలీసులు విఫలం అవుతుండడంతో ఈ దందా జోరుగా కొనసాగుతుందని తెలుస్తోంది. మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన ఉమ్మడి జిల్లాకు బాన్సువాడ, బోధన్‌లు నకిలీ పాస్‌పోస్టు సమస్యతో పాటు నకిలీ నోట్లు, నకిలీ దందాగా వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

Updated Date - 2021-07-24T07:09:18+05:30 IST