బదిలీల సందడి

ABN , First Publish Date - 2022-07-02T05:17:53+05:30 IST

సాధారణ బదిలీల ప్రక్రియ పూర్తయింది. శుక్రవారం జిల్లాలో 25 మంది తహసీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ ఉత్తర్వులు జారీచేశారు. జిల్లావ్యాప్తంగా 52 మంది డిప్యూటీ తహసీల్దార్లను కూడా బదిలీ చేశారు. వీరిలో కొంతమందిని ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు ఇన్‌చార్జిలుగా నియమించారు. కలెక్టరేట్‌లో 23 మంది జూనియర్‌ అసిస్టెంట్స్‌ను జిల్లాలో వేర్వేరు ప్రాంతాలకు, కలెక్టరేట్‌లో ఇతర సెక్షన్లకు బదిలీ చేశారు.

బదిలీల సందడి

25 మంది తహసీల్దార్లకు స్థానచలనం
డీటీలు, జూనియర్‌ అసిస్టెంట్లకు కూడా..
జడ్పీ సీఈవోగా వెంకట్రామన్‌
‘సుడా’ పరిపాలన అధికారిణిగా శాంతకుమారి
(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి)

సాధారణ బదిలీల ప్రక్రియ పూర్తయింది. శుక్రవారం జిల్లాలో 25 మంది తహసీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ ఉత్తర్వులు జారీచేశారు. జిల్లావ్యాప్తంగా 52 మంది డిప్యూటీ తహసీల్దార్లను కూడా బదిలీ చేశారు. వీరిలో కొంతమందిని ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు ఇన్‌చార్జిలుగా నియమించారు.  కలెక్టరేట్‌లో 23 మంది జూనియర్‌ అసిస్టెంట్స్‌ను జిల్లాలో వేర్వేరు ప్రాంతాలకు, కలెక్టరేట్‌లో ఇతర సెక్షన్లకు బదిలీ చేశారు. శ్రీకాకుళం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(సుడా) పరిపాలనాధికారిగా సీహెచ్‌ శాంతకుమారి నియమితులయ్యారు. ఈమె గ్రేటర్‌ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ డిప్యూటీ ప్రాజెక్టు అధికారిణిగా పని చేస్తున్నారు. అక్కడ నుంచి బదిలీపై జిల్లాకు త్వరలో రానున్నారు. జిల్లా పరిషత్‌ సీఈవోగా ఆర్‌ వెంకట్రామన్‌ నియమితులయ్యారు. ఈయన ప్రస్తుతం శ్రీకాకుళం ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తున్నారు. ఇంతవరకు విధులు నిర్వహించిన సీఈవో లక్ష్మీపతి.. పంచాయతీరాజ్‌ డిపార్ట్‌మెంట్‌కు రిపోర్టు చేయాల్సి ఉంది.

- శ్రీకాకుళం స్పెషల్‌ మొబైల్‌ కోర్టు ఏపీపీ జేఎస్‌వీ సుబ్రహ్మణ్యగిరి విజయనగరం స్పెషల్‌ జేఎఫ్‌సీఎం(ఎక్సైజ్‌)కు బదిలీ అయ్యారు.
- టెక్కలి జేఎఫ్‌సీఎం కోర్టు ఏపీపీ పి.రమేష్‌ పలాస జేఎఫ్‌సీఎం కోర్టుకు బదిలీ అయ్యారు.
- పలాస జేఎఫ్‌సీఎం కోర్టు ఏపీపీ బి సతీష్‌కుమార్‌ చీపురుపల్లి జేఎఫ్‌సీఎంకు బదిలీ అయ్యారు.
- పాతపట్నం జేఎఫ్‌సీఎం కోర్టు ఏపీపీ కె .చంద్రకుమార్‌ పార్వతీపురం జేఎఫ్‌సీఎం కోర్టుకు బదిలీ అయ్యారు.
- చీపురుపల్లి జేఎఫ్‌సీఎం కోర్టు ఏపీపీ ఎల్‌ రఘునాథ్‌ కొత్తూరు జేఎఫ్‌సీఎం కోర్టుకు బదిలీపై వస్తున్నారు.
- పొందూరు జేఎఫ్‌సీఎం కోర్టు ఏపీపీ సీహెచ్‌ చంద్రశేఖర్‌... శ్రీకాకుళం స్పెషల్‌ మొబైల్‌ కోర్టుకు బదిలీ అయ్యారు.
- ఆమదాలవలస జేఎఫ్‌సీఎం ఏపీపీ కె విమల్‌ రాథోర్‌.. భీమిలి మెట్రోపాలిటిన్‌ మెజిస్రేట్‌ కోర్టుకు బదిలీ అయ్యారు.
- కొత్తూరు జేఎఫ్‌సీఎం ఏపీపీ వెంకట శశికాంతి విశాఖపట్నం రెండో ఏసీఎంఎం కోర్టుకు బదిలీ అయ్యారు.

--------------------------
మండలం - తహసీల్దార్‌ పేరు
--------------------------------------
హిరమండలం - బి.మురళీమోహనరావు
ఎచ్చెర్ల - టి.సత్యనారాయణ
గార - ఎస్‌.సుధాసాగర్‌
మెళియాపుట్టి - పి.సరోజిని
నరసన్నపేట - ఏ సింహాచలం

సారవకోట - కె.ప్రవళ్లికప్రియ
పోలాకి - కె.శ్రీరాములు
జి.సిగడాం - పి.వేణుగోపాలరావు
సంతబొమ్మాళి - జె.చలమయ్య
జలుమూరు - బి.సత్యం

కోటబొమ్మాళి - జె ఈశ్వరమ్మ
రణస్థలం - ఎస్‌ కిరణ్‌కుమార్‌
బూర్జ - ఎం.సుధారాణి
ఇచ్ఛాపురం - ఎం లావణ్య
కంచిలి - ఎస్‌.హైమావతి

టెక్కలి ఆర్డీఓ డీఏఓ - బి రాజమోహన్‌
టెక్కలి(కేఆర్‌ఆర్‌సీ) - జి.ప్రఽభాకరరావు
టెక్కలి - ఎస్‌ గోపాలకృష్ణ
రేగిడి ఆమదాలవలస - టి కల్యాణచక్రవర్తి
సరుబుజ్జిలి - బి రమేష్‌కుమార్‌

కలెక్టరేట్‌ బి సెక్షన్‌ సూపరింటెండెంట్‌ - ఎం.సురేష్‌కుమార్‌
కలెక్టరేట్‌ డి సెక్షన్‌ సూపరింటెండెంట్‌ - జీఏ సూర్యనారాయణ
కలెక్టరేట్‌ జి సెక్షన్‌ సూపరింటెండెంట్‌ - ఎన్‌.హనుమంతురావు
కలెక్టరేట్‌ ఈ సెక్షన్‌ సూపరింటెండెంట్‌ - ఎ.సూర్యనారాయణ
కొవ్వాడ ప్రాజెక్టు - జె రామారావు
--------------------

Updated Date - 2022-07-02T05:17:53+05:30 IST