Advertisement

గర్భం దాల్చిన పద్నాలుగేళ్ల బాలిక

Jan 24 2021 @ 00:51AM

సీడబ్ల్యూసీకి అప్పగించిన ఐసీడీఎస్‌ అధికారులు  

నర్సాపూర్‌, జనవరి 23:  పద్నాలుగేళ్ల బాలిక గర్భం దాల్చిన ఘటన నర్సాపూర్‌ ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలో చోటు చేసుకున్నది. బాలిక నాలుగు నెలల గర్భం దాల్చిందని తెలుసుకున్న కుటుంబసభ్యులు గర్భాన్ని తొలగించేందుకు పలు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఐసీడీఎస్‌ సీడీపీవో హేమభార్గవి, సూపర్‌వైజర్‌ అంజమ్మ బాలికను శనివారం తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అనంతరం మెదక్‌లోని చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) ప్రతినిధులకు అప్పగించారు. ఆ బాలిక గర్భానికి కారకులైనవారిపై సీడబ్ల్యూసీ ప్రతినిధులు చట్టపరమైన చర్యలు తీసుకుంటారని ఐసీడీఎస్‌ సీడీపీవో హేమభార్గవి పేర్కొన్నారు. 

Follow Us on:
Advertisement