Viral Video: పెళ్లిలో కోపంగా ఉన్న అల్లుడికి షాక్ ఇచ్చిన అత్త.. వధువుతో పాటూ నేరుగా వేదికపైకి వచ్చి మరీ..

ABN , First Publish Date - 2022-09-01T00:59:36+05:30 IST

పెళ్లిళ్లలో ఒక్కోసారి చిత్రవిచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఒక్కోసారి అవి అవాక్కయ్యేలా ఉంటే.. ఇంకొన్నిసార్లు తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. ఇటీవల సోషల్ మీడియాలో...

Viral Video: పెళ్లిలో కోపంగా ఉన్న అల్లుడికి షాక్ ఇచ్చిన అత్త.. వధువుతో పాటూ నేరుగా వేదికపైకి వచ్చి మరీ..

పెళ్లిళ్లలో ఒక్కోసారి చిత్రవిచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఒక్కోసారి అవి అవాక్కయ్యేలా ఉంటే.. ఇంకొన్నిసార్లు తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. ఇటీవల సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలకు కొదువే లేదు. కొందరు ఫేమస్ కావాలనే ఉద్దేశంతో వివాహ కార్యక్రమాలను వినూత్నంగా నిర్వహిస్తుంటారు. ఇంకొందరు తమ టాలెంట్‌కు పదునుపెట్టి మరీ.. అందరి నోళ్లలో నానుతుంటారు. అలాగే కొన్ని వివాహాల్లో విచిత్ర ఆచారాలు పాటిస్తుంటారు. ఇలాంటి వీడియోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంటాయి. తాజాగా వైరల్ అవుతున్న వీడియో కూడా ఇలాంటిదే. పెళ్లిలో కోపంగా ఉన్న అల్లుడికి అత్తా షాక్ ఇస్తుంది. ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. 


ఇన్‌స్టాగ్రాంలో (Instagram) ఓ వీడియో వైరల్ అవుతోంది. వివాహ కార్యక్రమం సందర్భంగా ఊరేగింపు జరుగుతూ (Wedding procession) ఉంటుంది. ఆ సమయంలో వారి సాంప్రదాయం ప్రకారం.. అల్లుడు కోపంతో అలిగి ఉంటాడు. దీంతో కాసేపటికి వధువుతో పాటూ అతడి అత్త వేదికపైకి వస్తుంది. పూలతో కట్టిన కర్రను తీసుకుని కూతురుకు ఇస్తుంది. మరోవైపు వరుడు.. ఇవేవీ పట్టించుకోకుండా నిద్రపోయినట్లు నటిస్తూ ఉంటాడు. కర్ర తీసుకున్న వధువు.. తల్లి సూచన మేరకు వరుడి మొఖంపై అటు, ఇటూ కాస్తంత గట్టిగా నెట్టుతుంది. రెండు, మూడు సార్లు అలా చేసే సరికి వరుడు దారిలోకి వస్తాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social media) వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

ఒకేఒక్కడు.. ఎవరి కంటా పడకుండా.. 25ఏళ్ల ఒంటరి జీవితం.. చివరకు అతడి మరణంతో..





Updated Date - 2022-09-01T00:59:36+05:30 IST