crime news : ఓ వ్యక్తి హత్య.. రాజకీయ ప్రత్యర్థుల పనే అనుకున్న పోలీసులు.. విచారణలో బయటపడ్డ కూతురి దారుణం

Sep 26 2021 @ 19:59PM

తమిళనాడులో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ముందే అతను రాజకీయాల్లో ఉండడంతో ఇదంతా ప్రత్యర్థుల పనే అని అంతా అనుకున్నారు. వెంటనే పోలీసుల విచారణ మొదలైంది. అయితే చివరకు.. అదంతా కూతురు చేసిన పనే అని తెలిసి అంతా షాక్ అయ్యారు. 


ఇటీవల మహిళలు, యువతులు, బాలికలపై లైంగిక దాడులు పెరిగిపోయాయి. వయసు, వరసలు కూడా మరచిపోతున్న మృగాళ్ల అకృత్యాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ఆఖరికి సొంత కూతుళ్లను కూడా వక్ర బుద్ధితో చూస్తున్న రోజులివి. తమిళనాడుతో ఓ ప్రభుద్దుడు.. తన కుమార్తె పైనే కన్నేశాడు. అదును చూసుకుని బలత్కారానికి పాల్పడ్డాడు. ఊహించని ఈ పరిమాణామానికి ఆ కూతురు.. పెద్ద నిర్ణయమే తీసుకుంది. వివరాల్లోకి వెళితే..


తమిళనాడులోని విల్లుపురంలో వెంకటేశ్ అనే దివ్యాంగుడు.. భార్య చనిపోవడంతో తన ఇద్దరు కుమార్తెలతో కలిసి నివాసం ఉంటున్నాడు. పెద్ద కుమార్తె చెన్నై షాపింగ్ మాల్‌లో పని చేస్తుండగా చిన్న కుమార్తె ఇంటర్ చదువుతూ తండ్రితోనే ఉంటోంది. ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ వేసిన వెంకటేశ్.. ఇంటికి వచ్చాడు. మరుసటి రోజు శవమై కనిపించాడు. బంధువులు, స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కానీ దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడ్డాయి. 


రాజకీయ హత్యగా భావించిన అందరికీ అసలు విషయం తెలిసింది. తానే చంపానని వెంకటేశ్ చిన్న కూతురు.. పోలీసులతో చెప్పింది. తాను ఇంట్లో ఒంటరిగా ఉండగా.. తనపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడని చెప్పింది. వద్దని ఎంత వేడుకున్నా తన తండ్రి వినలేదని చెప్పింది. దీంతో చేసేదిలేక చంపాల్సి వచ్చిందని బోరుమంది. దీంతో ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.


అయితే ఈ ఘటన జిల్లా ఎస్పీ శ్రీనాథను కదిలించింది. ఆత్మరక్షణ కోసం తండ్రిని చంపిన కూతురుని.. వెంటనే బెయిల్‌పై విడుదల చేయాలని ఆదేశించారు. అయితే ఆసుపత్రి రిపోర్టు వచ్చిన తర్వాత అత్యాచారం జరిగిందా లేదా అనేది తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు.

Follow Us on:

క్రైమ్ మరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.