తనకు వచ్చిన వ్యాధి గురించి యూట్యూబ్‌లో వెతికి.. చాలా ఖర్చు అవుతుందని తెలిసి 12 ఏళ్ల బాలిక తీసుకున్న నిర్ణయమిదీ..!

ABN , First Publish Date - 2022-09-16T23:59:16+05:30 IST

అప్పటికే కిడ్నీల సమస్యతో భార్య మంచాన పడింది. ఆర్థిక స్థోమత అంతంతమాత్రమే కావడంతో డయాలసిస్ చేయించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. ఈ క్రమంలో ఉన్నట్టుండి..

తనకు వచ్చిన వ్యాధి గురించి యూట్యూబ్‌లో వెతికి.. చాలా ఖర్చు అవుతుందని తెలిసి 12 ఏళ్ల బాలిక తీసుకున్న నిర్ణయమిదీ..!

అప్పటికే కిడ్నీల సమస్యతో భార్య మంచాన పడింది. ఆర్థిక స్థోమత అంతంతమాత్రమే కావడంతో డయాలసిస్ చేయించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. ఈ క్రమంలో ఉన్నట్టుండి కూతురి ఆరోగ్యం కూడా క్షీణించింది. వైద్యులకు చూపించగా అరుదైన వ్యాధితో బాధపడుతోందని తెలిపారు. దీంతో అతడికి ఏం చేయాలో దిక్కుతోచలేదు. తండ్రి బాధను గమనించిన కూతురు.. తనకు వచ్చిన వ్యాధి గురించి సమాచారం తెలుసుకునేందుకు యూట్యూబ్‌లో వెతికింది. ఆ వ్యాధికి సంబంధించిన చికిత్స చాలా ఖర్చుతో కూడుకున్నదని తెలుసుకుంది. దీంతో చివరకు షాకింగ్ నిర్ణయం తీసుకుంది.


ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) హర్దోయ్‌ అనే ప్రాంతానికి చెందిన రామ్ రతన్.. చాలా కాలంగా నోయిడా పరిధి గిజోడ్ గ్రామంలో భార్య, నలుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారుడుతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఇద్దరు కూతుళ్లకు వివాహమైంది. ఒక కొడుకు నోయిడా అథారిటీలో పని చేస్తుండగా.. మరో కొడుకు కూలి పనులకు వెళ్తుంటాడు. కాగా, రతన్ చిన్న కుమార్తె అయినా ముస్కాన్ అకా సోనాక్షి (12)కి కొన్ని నెలలుగా ఆరోగ్యం (illness) బాగాలేదు. చాలా మంది వైద్యులకు చూపించిన అంనతరం.. చివరకు పెద్దాసుపత్రికి తీసుకెళ్లారు. ఆమె లివర్ సిర్రోసిస్ (Liver cirrhosis disease) అనే అరుదైన వ్యాధితో బాధపడుతోందని వైద్యులు తెలిపారు. ఇప్పటికే రతన్ భార్య కొన్ని నెలలుగా కిడ్నీ సమస్యతో (Kidney problem) బాధపడుతోంది. ప్రస్తుతం ఆమెకు తరచూ డయాలసిస్ (Dialysis) చేయించాల్సి వస్తోంది.

ఓ మహిళ మృతదేహానికి పోస్ట్‌మార్టం చేస్తుండగా షాకింగ్ ట్విస్ట్.. దుస్తుల్లో డాక్టర్‌కు ఓ లేఖ కనిపించడంతో..    


ఈ క్రమంలో కూతురు కూడా అనారోగ్యానికి గురవడంతో వారికి మరిన్ని కష్టాలు వచ్చిపడ్డాయి. కూతురికి వైద్యం చేయించేంత స్థోమత వారి వద్ద లేకపోవడంతో.. దిక్కుతోచని స్థితిలో పడ్డారు. తండ్రి బాధను గమనించిన కూతురు.. ఆ వ్యాధి గురించి సమాచారం తెలుసుకోవడానికి యూట్యూబ్‌లో సెర్చ్ చేసింది. లివర్ సిర్రోసిస్ వ్యాధి చికిత్స చాలా ఖర్చుతో కూడుకున్నదని తెలుసుకుంది. తన కారణంగా తన కుటుంబం మొత్తం ఇబ్బందులు పడకూడదని నిర్ణయించుకుంది. ఇంటి ఆవరణలోని చెట్టు కింద కూర్చుని చాలా సేపు ఆలోచించింది. చివరకు చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన కుటుంబ సభ్యలు ఆమెను రక్షించి, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న స్థానికులు అయ్యో పాపం!.. అంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు.

షాకింగ్ ఘటన.. కూతురి మృతదేహాన్ని ఉప్పుతో పూడ్చేసిన తండ్రి.. 44 రోజుల తర్వాత బయటకు తవ్వి తీసి..



Updated Date - 2022-09-16T23:59:16+05:30 IST