
ఇంటర్నెట్ డెస్క్: మార్షల్ ఆర్ట్స్‌లో విజయం సాధించిన ఓ చిన్నారికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రత్యర్థిపట్ల ఆ చిన్నారి చూపిన వైఖరి.. నెటిజన్లు ఫిదా చేసింది. ఈ క్రమంలో ఆ చిన్నారిపట్ల పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
పోటీల్లో గెలవాలని.. నలగురితో ‘శభాష్’ అనిపించుకోవాలనే ప్రతి ఒక్కరూ కష్టపడతారు. రాత్రి పగలు తేడా లేకుండా కసరత్తులు చేస్తారు. కానీ విజయం.. ఒకరిని మాత్రమే వరిస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ క్రమంలోనే మార్షల్ ఆర్ట్స్ పోటీల్లో గెలుపొంది.. విజయ తీరాలకు చేరిన ఓ చిన్నారి తన ప్రత్యర్థి పట్ల ప్రదర్శించిన వైఖరి అందరినీ ఆకట్టుకుంది. గెలుపొందానని సంబరాలు చేసుకోకుండా.. తన ప్రత్యర్థి ఓటమి బాధ నుంచి బయటపడేందుకు చేయందించింది. ప్రత్యర్థి చేయిని పట్టుకుని చేతిని పైకెత్తింది. నువ్వూ అద్భుతంగా ఆడావంటూ ప్రత్యర్థిపై ప్రశంసలు కురిపించింది. ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. దీంతో స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఇది కదా నిజమైన క్రీడాస్ఫూర్తి’ అంటూ సదరు చిన్నారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి